Interest Rate: వృద్ధులకు బంపరాఫర్.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కన్నా అధిక వడ్డీ వచ్చే పథకం ఇది.. 9శాతానికి పైగా వడ్డీ..

సాధారణంగా ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ కన్నా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లోనే అధిక ప్రయోజనాలు ఉంటాయి. కానీ కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కన్నా అధిక వడ్డీని ఫిక్స్‌డ్ డిపాజిట్ పై అందిస్తున్నాయి. నాలుగు బ్యాంకులు 9% కన్నా ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

Interest Rate: వృద్ధులకు బంపరాఫర్.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కన్నా అధిక వడ్డీ వచ్చే పథకం ఇది.. 9శాతానికి పైగా వడ్డీ..
Senior Citizen savings scheme

Updated on: May 12, 2023 | 2:38 PM

వృద్ధులకు చాలా పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. అధిక వడ్డీతో కూడిన పెట్టుబడి పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అత్యంత ప్రజాదరణ పొందింది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్). దీనిలో అధిక ప్రయోజనాల కారణంగా అత్యధిక శాతం మంది వృద్ధులు దీనిలో ముందు నుంచే పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కన్నా అధికంగా వడ్డే వచ్చే స్కీమ్ మరోకటి ఉంది. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్. సాధారణంగా ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ కన్నా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లోనే అధిక ప్రయోజనాలు ఉంటాయి. కానీ కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కన్నా అధిక వడ్డీని ఫిక్స్‌డ్ డిపాజిట్ పై అందిస్తున్నాయి. నాలుగు బ్యాంకులు 9% కన్నా ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఆ బ్యాంకుల గురించి ఓ సారి చూద్దాం..

సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీపై 9% ఎక్కువ ఇచ్చే బ్యాంకులు ఇవే..

యూనిటీ బ్యాంక్.. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) సీనియర్ సిటిజన్‌లకు 1001 రోజుల వ్యవధితో డిపాజిట్‌పై గరిష్టంగా 9.5% రాబడిని అందిస్తోంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త ఎఫ్ డీ రేట్లు మే 2, 2023 నుండి అమలులోకి వస్తాయి.

సూర్యోదయ్ బ్యాంక్.. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది . ఇప్పుడు, సీనియర్ సిటిజన్లు 4.50% నుండి 9.60% వరకు అందిస్తోంది. కొత్త వడ్డీ రేట్లు మే 5, 2023 నుండి అమలులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఉత్కర్ష్ బ్యాంక్.. 700 రోజుల ఫిక్స్ డ్ డిపాజిట్ పై, బ్యాంక్ సాధారణ ప్రజలకు గరిష్టంగా 8.25% , సీనియర్ సిటిజన్‌లకు 9.00% వడ్డీ రేటును అందిస్తోంది. 27 ఫిబ్రవరి 2023 నుండి అమలులోకి వచ్చాయి.

ఫిన్‌కేర్ బ్యాంక్.. 1000 రోజుల డిపాజిట్ పై, సాధారణ ప్రజలకు గరిష్టంగా 8.41%, సీనియర్ సిటిజన్లకు 9.01% వడ్డీ అందిస్తోంది. ఈ రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాత్రమే ఉంటుంది. ఇది 24 మార్చి 2023 నుంచి అమలులోకి వచ్చింది.

ప్రధాన బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా..

సీనియర్ సిటిజన్స్ కు ఎస్బీఐ, హెచ్ డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్, పీఎన్బీ, యాక్సిస్ బ్యాంకులు కూడా ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీరేటుతో పాటు పలు ఆఫర్లను ప్రకటించాయి. ఆయా బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా..

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు- 3.50% నుంచి 7.60%
  • హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు- 3.50% నుంచి 7.75%
  • ఐసీఐసీ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు- 3.50% నుంచి 7.60%
  • కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు- 3.25% నుండి 7.70%
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు- 4.00% నుండి 7.75%
  • యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ- 3.50% నుండి 7.95%

ఇది గుర్తుంచుకోవాలి..

అయితే, ఈ ఎఫ్‌డీలలో అధిక వస్తున్నప్పటికీ సీనియర్ సిటిజెన్లకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లోనే అధిక ప్రయోజనాలుంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. పెట్టుబడి పెట్టేముందు దీనిపై మరింత వివరంగా తెలుసుకోవడం ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..