Affordable Electric Cars: సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కార్లు.. చిన్న ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్లు ఇవే..

మన దేశంలో తక్కువ ధరలో మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు గురించి ఎప్పుడు తెలుసుకుందాం.. ఇవి మధ్యతరగతి కుటుంబాలకు, సిటీ అవసరాలను తీర్చడంలో బాగా ఉపకరిస్తాయి.

Affordable Electric Cars: సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కార్లు.. చిన్న ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్లు ఇవే..
MG Comet EV

Updated on: May 01, 2023 | 3:30 PM

ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ శ్రేణి వాహనాల వినియోగం పెరుగుతోంది. మన భారతదేశంలో కూడా క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకుని కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే వినియోగదారులు ప్రధానంగా ఆయా వాహనాల ధరను పరిగణనలోకి తీసుకొని వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. తమకు అనువైన బడ్జెట్లో తమ అవసరాలకు అనుగుణంగా వాహనాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మన దేశంలో తక్కువ ధరలో మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల గురించి ఎప్పుడు తెలుసుకుందాం.. ఇవి మధ్యతరగతి కుటుంబాలకు, సిటీ అవసరాలను తీర్చడంలో బాగా ఉపకరిస్తాయి.

పీఎంఈ ఈజ్(PMV EASE)..

ఈ పీఎంఈ ఈజ్ ఎలక్ట్రిక్ కారును కేవలం రూ. 4.79 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ చిన్న కారులో 48వాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది కారు మోడ్ ఆధారంగా మైలేజీ ఇస్తుంది. గరిష్టంగా సింగిల్ చార్జ్ పై గంటకు 200 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది. ఈ కారు టాప్-స్పీడ్ గురించి చెప్పాలంటే గంటకు 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, ఎల్సీడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రిమోట్ డోర్ లాక్-అన్‌లాక్, పవర్ విండోస్, ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎంజీ కామెట్ ఈవీ(MG Comet EV)..

ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్. ఈ ఎలక్ట్రిక్ కారు ధరను కంపెనీ ఎక్స్-షోరూమ్ రూ.7.98 లక్షలుగా ఉంచింది. ఈ కారులో 17.3kWh బ్యాటరీ అందించారు. ఈ బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తే 250 కిమీల దూరాన్ని కవర్ చేయగలుగుతుంది. పీచర్ల విషయానికి వస్తే.. ట్విన్ డిస్‌ప్లే, 100కి పైగా వాయిస్ కమాండ్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆటో ట్రాన్స్‌మిషన్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, ముందు సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీ, ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ సీటు బెల్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

స్టోర్మ్ ఆర్3(Storm R3)..

అతి తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కారును రూ. 4.5 లక్షలకు అందించే అవకాశం ఉంది. కంపెనీ తన కారు కోసం ప్రీ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ కారులో 15kWh బ్యాటరీ ఉపయోగించారు. ఇది సింగిల్ చార్జ్ పై 200 కి.మీ దూరం ప్రయాణించగలుగుతుంది. ఫీచర్ల విషయానికి వస్తే పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, డిజిటల్ డిస్‌ప్లే, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన సాంకేతికతతో కూడిన ఫీచర్లు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..