Jio: 8 ఏళ్లు పూర్తి చేసుకున్న జియో.. టెలికం రంగంలో వచ్చిన మార్పులివే..

|

Sep 05, 2024 | 4:57 PM

2016 సెప్టెంబర్‌లో జియో సేవలు ప్రారంభమయ్యాయి. యూజర్లు పెద్ద ఎత్తున ఆకట్టుకుంటూ, రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది జియో. దేశవ్యాప్తంగా 49 కోట్ల మంది సబ్ స్క్రైబర్ బేస్‌కు చేరుకుంది. 8% దాకా అంతర్జాతీయ డేటా ట్రాఫిక్‌ను జియో పొందింది. ఫలితంగా.. డాటా వినియోగంలో 2016లో భారత్ 155 వ స్థానం...

Jio: 8 ఏళ్లు పూర్తి చేసుకున్న జియో.. టెలికం రంగంలో వచ్చిన మార్పులివే..
Reliance Jio
Follow us on

టెలికం రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది జియో. అప్పటి వరకు డేటా వినియోగంలో ఉన్న పరిమితులన్నింటినీ చెరిపేసి సరికొత్త ఒరవడిని సృష్టించింది. డేటా ఛార్జీలు ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జియోదే అని చెప్పడంలో సందేహం లేదు. జియో ప్రస్థానం మొదలై నేటికి సరిగ్గా 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే టెలికం రంగంలో జియో ఎలాంటి మార్పులకు కారణమైందో ఇప్పుడు తెలుసుకుందాం.

2016 సెప్టెంబర్‌లో జియో సేవలు ప్రారంభమయ్యాయి. యూజర్లు పెద్ద ఎత్తున ఆకట్టుకుంటూ, రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది జియో. దేశవ్యాప్తంగా 49 కోట్ల మంది సబ్ స్క్రైబర్ బేస్‌కు చేరుకుంది. 8% దాకా అంతర్జాతీయ డేటా ట్రాఫిక్‌ను జియో పొందింది. ఫలితంగా.. డాటా వినియోగంలో 2016లో భారత్ 155 వ స్థానంలో ఉండగా, ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో దేశంలో డాటా వినియోగం 73 రేట్లు పెరిగింది.

ఇక దేశంలో అగ్రగామి టెలికం సంస్థగా ఎదిగింది జియో. ఉచిత అపరిమిత కాల్స్, భారతదేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్‌ను ప్రవేశపెట్టింది జియో. ఓవర్ ఎల్టీఈ (విఒఎల్ టిఇ)ని తీసుకొచ్చిన ఘనత జియోదే. వై-ఫై కాలింగ్ ను ప్రవేశపెట్టడం ద్వారా కనెక్టివిటీ ఆప్షన్లను జియో మరింతగా మెరుగుపర్చింది. అంతేగాకుండా 4జి ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెట్టడం ద్వారా డిజిటల్ సేవల విస్తృతి పెరగడానికి కారణమైంది. ఇక 5జీ నెట్‌వర్క్‌ విషయంలో కూడా జియో ముందుంది. క్వాంటమ్ సెక్యూరిటీ వంటి అధునాతన ఫీచర్లను ఈ 5జి స్టాక్ సపోర్ట్ చేస్తుంది. ఇక 2023లో జియో సంస్థ జియో భారత్, జియో బుక్, జియో ఎయిర్ ఫైబర్ లను ప్రవేశపెట్టింది. 2023-24లో జియో 148.5 బిలియన్ జీబీల డేటాను, 5.5 ట్రిలియన్ నిమిషాల వాయిస్‌ను నిర్వహించింది.

ఇక జియో ఇప్పటి వరకు 1,687 పేటెంట్లకు దరఖాస్తు చేసింది. 6జి, ఏఐ, బిగ్ డేటా, ఐఓటీ వంటి కీలక రంగాలకు కూడా ఈ పేటెంట్లు విస్తరించాయి. అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ లో 8 శాతం వాటా కలిగి ఉంది. భారత్ మొత్తం డేటా ట్రాఫిక్ లో జియో 60 శాతం వాటా కలిగిఉంది జియో. భారతదేశ 5జి రేడియో కాల్స్ లో 85% జియో నెట్ వర్క్ పరిధిలోనే ఆపరేట్ అవుతున్నాయి. జియో భారీ స్థాయి ఏఐ మౌలిక వసతులను సమకూర్చుకుంటోంది. గిగావాట్ స్థాయి ఏఐ రెడీ డేటా సెంటర్స్ ను జామ్ నగర్ లో ఏర్పాటు చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..