Investment Ideas: సంపద సృష్టి రహస్యం ఇదే.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన.. ట్రై చేయండి..
సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వంటి సంప్రదాయ పథకాలు నిర్ణీత సమయంలో మీకు మంచి మొత్తంలో రాబడిని అందిస్తాయి. అదే విధంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్, ఈక్విటీ ట్రేడింగ్ వంటి అత్యంత పాపులర్ విధానాలు కూడా మీకు వెల్త్ క్రియేట్ చేయడంలో సాయపడతాయి. వీటిల్లో రిస్క్ ఉన్నా.. అధిక రాబడిని అయితే అందిస్తాయి. ఇవే కాక ఇంకా చాలా రకాల పెట్టుబడి పథకాలు మార్కెట్లో మనల్ని ఆకర్షిస్తున్నాయి.
ఇటీవల కాలంలో జనాలు వివిధ పథకాలలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆర్థిక అక్షరాస్యత పెరగడంతో తమ సంపాదన నుంచి ఎంతో కొంత ఏదో పథకంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. అందుకోసం మార్కెట్లో చాలా రకాల పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉంటాయి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వంటి సంప్రదాయ పథకాలు నిర్ణీత సమయంలో మీకు మంచి మొత్తంలో రాబడిని అందిస్తాయి. అదే విధంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్, ఈక్విటీ ట్రేడింగ్ వంటి అత్యంత పాపులర్ విధానాలు కూడా మీకు వెల్త్ క్రియేట్ చేయడంలో సాయపడతాయి. వీటిల్లో రిస్క్ ఉన్నా.. అధిక రాబడిని అయితే అందిస్తాయి. ఇవే కాక ఇంకా చాలా రకాల పెట్టుబడి పథకాలు మార్కెట్లో మనల్ని ఆకర్షిస్తున్నాయి. ఇవి మీ ఆర్థిక లక్ష్యాలను వేగంగా అందుకునేందుకు దొహదపడతాయి. అయితే వాటిపై అవగాహన లేకపోవడమే ప్రధాన లోపం. ఈ నేపథ్యంలో అలాంటి ఓ ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాలను మీకు పరిచయం చేస్తున్నాం. ఇవి కూడా మీకు నిర్ణీత సమయంలో అధికా రాబడిని అందిస్తాయి.
రియల్ ఎస్టేట్..
ప్రాపర్టీలపై అద్దెలు.. మీకు ఏదైనా సొంత ఇల్లు, లేదా షాపులు ఉంటే వాటి ద్వారా మీరు డబ్బు సంపాదించొచ్చు. వాటిని అద్దెకు ఇవ్వడం వల్ల చాలా నిరంతరాయంగా ఆదాయం వస్తుంది.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్స్(ఆర్ఈఐటీ).. ఏదైనా మంచి రియల్ వెంచర్ వైపు మొగ్గుచూపొచ్చు. వాటిపై పెట్టుబడి పెట్టొచ్చు. దీని వల్ల మీకు డైరెక్ట్ ఓనర్షిప్ వస్తుంది. మీ డబ్బు లిక్విడ్ రూపంలో కాకుండా ఫిజికల్ రూపంలో అందుబాటులో ఉంటుంది.
ఇవి గుర్తుంచుకోండి.. అయితే రియల్ ఎస్టేట్ లో మీరు పెట్టుబడులు పెట్టేముందు కొన్ని అంశాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అవేంటంటే ఈ రియల్ ఎస్టేట్ లో మొదటి పెట్టుబడి చాలా ఎక్కువ ఉంటుంది. అద్దెకు ఇచ్చిన సమయంలో బాధ్యతగా వాటిని మేనేజ్ చేసుకోవాలి.
పీర్ టు పీర్(పీ2పీ) లెండింగ్.. ఆన్ లైన్ వేదికగా వ్యక్తులకు, వ్యాపారస్తులకు అప్పుగా డబ్బును ఇవ్వొచ్చు. దీని వల్ల వడ్డీ ఆదాయం రూపంలో వస్తుంది. అయితే దీనిలో రిస్క్ ఉంటుంది. మీరు ఎవరికి అప్పు ఇస్తున్నారు? వారు తిరిగి చెల్లిస్తారా? వడ్డీ సక్రమంగా ఇస్తారా అన్న విషయాలు బేరీజు వేసుకోవాలి. అక్కడ మీ నమ్మకమే మీ పెట్టుబడి. ప్రస్తుతం ఈ బిజినెస్ బాగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది పెట్టుబడిదారులు ఈ విధంగా దాదాపు రూ. 10,000 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టినట్లు పలు ఆన్ లైన్ నివేదికలు చెబుతున్నారు.
ఏదైనా వ్యాపారం.. మీ వద్ద ఉన్న నగదుతో ఏదైనా వ్యాపారం ప్రారంభించొచ్చు. ఇది విజయవంతమైతే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీని కోసం కష్టపడాలి. వ్యాపార వృద్ధికి తెలివిగా పనిచేయాలి.
ఏంజెల్ ఇన్వెస్ట్ మెంట్.. మీరు ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మంచి రాణిస్తాయనుకున్న కొత్త కంపెనీల్లో పెట్టడం ఉత్తమం. అయితే దీనిలోనూ అధిక రిస్క్ ఉంటుంది. అదే సమయంలో క్లిక్ అయితే అధిక రాబడి కూడా వస్తుంది.
విలువైన వస్తువుల సేకరణ.. ఏదైనా కళకు సంబంధించిన లేదా అరుదైన నాణేలు, పురాత వస్తువుల వంటి వాటిపై పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచనే. ఆ వస్తువు పాతబడే కొద్దీ విలువ పెరిగేది అయి ఉండాలి.
ఇవి గుర్తుంచుకోండి..
- మీరు దేనిలో పెట్టుబడి పెట్టినా కొన్ని అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అవేంటంటే మీరు పెట్టబడిని డైవర్సిఫై చేయాలి. ఒకేచోట మీ పెట్టుబడులను ఉంచకూడదు. వివిధ ఆస్తి తరగతులలో విస్తరించాలి.
- అదే సమయంలో ఏదైనా ప్రత్యామ్నాయ ఆస్తి తరగతిలో పెట్టుబడి పెట్టే ముందు దానిపై పరిశోధన ముఖ్యం. దీని వల్ల దానిలో ప్రమాదాలు, దాని వ్యవహారం అవగతం అవుతుంది.
- సంప్రదాయ స్టాక్స్, బాండ్ల కంటే ఈ ప్రత్యామ్నాయ పెట్టుబడులు చాలా ప్రమాదకరం. అందుకే వీటిల్లో పెట్టుబడులు పెట్టే ముందే దాని రిస్క్ టాలెరెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి.
- మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా, వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం మేలు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..