FD Interest Rates Hike: ఫిక్స్‌ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా? అధిక వడ్డీ రేట్లను అందిస్తున్న 3 ప్రధాన బ్యాంకులివే..!

ఆర్బీఐ రెపోరేటు, రివర్స్ రెపోరేటు సవరించడంతో.. దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు..

FD Interest Rates Hike: ఫిక్స్‌ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా? అధిక వడ్డీ రేట్లను అందిస్తున్న 3 ప్రధాన బ్యాంకులివే..!
Fd

Updated on: Mar 03, 2023 | 8:27 PM

ఆర్బీఐ రెపోరేటు, రివర్స్ రెపోరేటు సవరించడంతో.. దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు.. ప్రైవేట్‌రంగ బ్యాంకులు సైతం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కస్టమర్లు చేసే ఎఫ్‌డీ లపై 3 శాతం నుంచి దాదాపు 8.25 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి. వీటిలో ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ ఉన్నాయి. ఈ మూడు బ్యాంకులు కస్టమర్లకు ఎఫ్‌డీలపై భారీ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఆ వడ్డీ రేట్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్..

ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ తన కస్టమర్లకు గరిష్ట వడ్డీ రేటును అందిస్తోంది. ఎక్కువ కాలం ఎఫ్‌డీలకు సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే సాధారణ కస్టమర్లకు 7.75 వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే, తక్కువ కాల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచింది.

ఇండస్‌ఇండ్ బ్యాంక్..

ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఇటీవలే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రైవేట్‌రంగ బ్యాంకు అయిన ఇండస్‌ఇండ్.. సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.50 శాతం నుంచి 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. దీని కాల వ్యవధి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల 3 నెలల వరకు ఉంటుంది. అంతకంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్‌డీలకు కొంచెం తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

యెస్ బ్యాంక్..

యెస్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సాధారణ ప్రజలకు డిపాజిట్ రేట్లను 3.25 శాతం-7.5 శాతం ఇస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు కాలపరిమితిని బట్టి 3.75 శాతం నుంచి 8.00 శాతం వరకు ఇస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us