
క్రెడిట్ కార్డ్ అనేది ఇటీవల కాలంలో ఉపయోగకరమైన, వినూత్నమైన ఆర్థిక సాధనంగా మారింది. ముఖ్యంగా కస్టమర్‌లు ఎటువంటి అదనపు ప్రక్రియ లేదా అడ్డంకులు లేకుండా బ్యాంకు నుంచి ముందస్తు క్రెడిట్‌ను పొందేందుకు వీలు కల్పిస్తుంది. రోజువారీ ఖర్చులను నిర్వహించడానికి, క్రెడిట్ హిస్టరీను సృష్టించడానికి, అలాగే రివార్డుల ప్రయోజనాలను పొందడానికి మీకు సహాయపడుతుంది. కొంతమంది తమ క్రెడిట్ కార్డులను చాలా అరుదుగా ఉపయోగిస్తారు లేదా వాటిని అస్సలు ఉపయోగించరు. అలాంటి పరిస్థితిలో ఈ కార్డులు ఇన్ యాక్టివ్‌గా మారతాయి. దాదాపు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు కార్డు వాడకపోతే అది ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది.
అయితే ఇన్‌యాక్టివ్ క్రెడిట్ కార్డ్ మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అనుకోని సందర్భాల్లో రుణం పొందడం చాలా కష్టమవుతుంది. ఎక్కువ కాలం నిష్క్రియాత్మకంగా ఉంటే వల్ల బ్యాంకులు ఆటోమెటిక్‌గా మీ క్రెడిట్ కార్డును మూసివేస్తాయి. ఇలాగైతే మీ క్రెడిట్ హిస్టరీ ప్రభావితం చేస్తుంది. అలాగే ప్రతి క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై కొన్ని పెర్క్‌లు, రివార్డులను అందిస్తుంది. కార్డు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే మీరు మీ రివార్డులు మరియు పెర్క్‌లను కోల్పోతారు. కార్డు ఇన్‌యాక్టివ్ అయ్యాక క్రెడిట్ కార్డును మూసేసినా కూడా మీ క్రెడిట్ చరిత్రపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కార్డును జారీ చేసే బ్యాంకులు మీ కార్డును నిష్క్రియం చేసిన తర్వాత దాన్ని తిరిగి సక్రియం చేయడానికి మీకు కొన్ని రోజుల సమయం ఇస్తాయి. ఆ సమయంలో కచ్చితంగా కార్డును యాక్టివ్ చేసుకోవాలని వివరిస్తున్నారు.
ఇన్‌యాక్టివ్ క్రెడిట్ కార్డు ఖాతాలను బ్యాంకులు ప్రత్యేక లెడ్జర్లలో ఉంచుతాయి. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే మోసాలను తగ్గించడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటారు. ఇన్‌యాక్టివ్ అయిన క్రెడిట్ కార్డును తిరిగి యాక్టివ్ చేయాలంటే కచ్చితంగా మీరు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ లేదా ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్‌ను సందర్శించవచ్చు. కొన్ని బ్యాంకులకు గుర్తింపు ధ్రువీకరణ లేదా అప్‌డేటెడ్ కేవైసీ వివరాలను తీసుకుని కార్డును యాక్టివ్ చేస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి