AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF vs FD: ఆ పథకాలతో పొదుపు మంత్రం పక్కా సక్సెస్‌.. బోలెడన్నీ ఆర్థిక ప్రయోజనాలు.. వివరాలివే..!

పొదపు విషయానికి వస్తే భారతీయులకు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, అయితే వాటిలో రెండు అత్యంత ప్రజాదరణ పొందినవి  ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకాలు భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందాయి. ఇన్సూరెన్స్‌ పథకాలు ఉన్నప్పటికీ  అవి జీవిత బీమా కేటగరీలోకి వెళ్తాయి కాబట్టి పొదుపు చేసే వారు వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

PPF vs FD: ఆ పథకాలతో పొదుపు మంత్రం పక్కా సక్సెస్‌.. బోలెడన్నీ ఆర్థిక ప్రయోజనాలు.. వివరాలివే..!
Money
Nikhil
|

Updated on: Aug 04, 2023 | 5:15 PM

Share

భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా అనుకోని ఆపద సమయాల్లో ఆసరాతో పాటు రిటైర్మెంట్‌ సమయంలో భరోసా ఉంటుందని అందరూ చెబుతూ ఉంటారు. అలాగే పొదపు విషయానికి వస్తే భారతీయులకు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, అయితే వాటిలో రెండు అత్యంత ప్రజాదరణ పొందినవి  ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకాలు భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందాయి. ఇన్సూరెన్స్‌ పథకాలు ఉన్నప్పటికీ  అవి జీవిత బీమా కేటగరీలోకి వెళ్తాయి కాబట్టి పొదుపు చేసే వారు వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ రెండు పథకాల్లో పెట్టుబడి ఎలాంటి లాభాలు ఉన్నాయో? సవివరంగా తెలుసుకుందాం.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వ మద్దతు ఉన్న పెట్టుబడి పన్ను ఆదా చేసే పథకం. ఇది మీ వార్షిక పన్నులను తగ్గిస్తూనే పదవీ విరమణ నిధులను కూడబెట్టుకోవడానికి మిమ్మల్ని అనుమతించే పెట్టుబడిగా పని చేస్తుంది. పీపీఎఫ్‌ ఖాతా కనీస కాలవ్యవధి 15 సంవత్సరాలు. మీ ప్రాధాన్యత ప్రకారం దానిని 5 సంవత్సరాల బ్లాక్‌లలో పొడిగించే అవకాశం ఉంది. మీరు ఒక ఆర్థిక సంవత్సరానికి కనిష్టంగా రూ. 500 నుంచి  గరిష్టంగా రూ. 1.5 లక్షలను ఒకేసారి లేదా గరిష్టంగా 12 వాయిదాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతా తెరవడానికి కనీసం రూ. 100 నెలవారీ డిపాజిట్ అవసరం. అయితే సంవత్సరానికి రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడులు వడ్డీని పొందవు. అలాగే పన్ను ఆదా కోసం అర్హత కూడా పొందవు. పీపీఎఫ్‌ ఖాతాలో డిపాజిట్లు కనీసం 15 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం ఒకసారి చేయాలి. పీపీఎఫ్‌  పథకం ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80 సీ ప్రకారం సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం రెండూ పన్ను రహితంగా ఉంటాయి. ప్రస్తుత పీపీఎఫ్‌ వడ్డీ రేటు సంవత్సరానికి 7.1 శాతంగా ఉంటుంది. 

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) అందించే పొదుపు సాధనాలు. ఎఫ్‌డీలు సురక్షితమైన పెట్టుబడి మార్గాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే వడ్డీ రేట్లు భారత ప్రభుత్వంతో నిర్ణయిస్తారు. వాటిపై మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ పొందుతాయి. ఎఫ్‌డీ పదవీకాలం మీ పెట్టుబడి లక్ష్యం ఆధారంగా మారవచ్చు. కనిష్టంగా ఏడు రోజుల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఉంటుంది. క్యుములేటివ్ ఎఫ్‌డీలు అర్ధ-వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన వడ్డీ సమ్మేళనంగా ఉంటుంది. ఫలితంగా ప్రధాన మొత్తంపై అధిక లాభాలు పొందుతాయి. సీనియర్ సిటిజన్‌ల కోసం చాలా బ్యాంకులు అధిక స్థిర వడ్డీ రేటును అందిస్తాయి. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా పెద్ద మొత్తంలో పొదుపులను కూడగట్టుకునేందుకు వీలు కల్పిస్తాయి. అదనంగా నిర్దిష్ట ఎఫ్‌డీలు నెలవారీ చెల్లింపు ఎంపికను అందిస్తాయి, ఇది వ్యక్తులకు నమ్మకమైన ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు మీ ఆదాయపు పన్ను బాధ్యతను తగ్గించడంలో సహాయపడతాయి. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పెట్టుబడిదారులు రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం