భారతదేశంలో ఓ పదేళ్ల నుంచి స్కూటర్ల అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. ముఖ్యంగా మహిళలతో పాటు పురుషులు కూడా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు స్కూటర్లే బెస్ట్ అని ఫీల్ అవ్వడంతో కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టీవీఎస్ జూపిటర్ అప్‌డేటెడ్ రిలీజ్ చేసిన విషయంలో తెలిసిందే. అలాగే హోండా యాక్టివా కూడా 6జీ వెర్షన్ సేల్స్‌లో దుమ్ము దులుపుతుంది. హోండా యాక్టివా హెచ్-స్మార్ట్ టెక్నాలజీతో 2023లో నవీకరించబడిన ‘స్మార్ట్’ వేరియంట్‌తో ఆకట్టుకుంటుంది. అలాగే న్యూ జూపిటర్ ఐజీఓ అసిస్ట్‌తో వస్తుంది. ఈ నేపథ్యంలో హోండా, జూపిటర్ స్కూటర్ మధ్య ప్రధాన తేడాలను తెలుసుకుందాం.
కొత్తగా ప్రారంభించబడిన జూపిటర్ మునుపటి 109 సీసీ కంటే కొంచెం ఎక్కువ అప్డేట్ చేయబడిన 113 సీసీ 4 స్ట్రోక్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో వస్తుంది. ఐజీఓ టెక్నాలజీతో సహాయంతో 7.9 బీహెచ్‌పీ, 9.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 82 కి.మీ అని కంపెనీ ప్రతినిదులు చెబుతున్నారు. మరోవైపు యాక్టివా 110 సీసీ కెపాసిటీతో 7.7 బిహెచ్‌పీ పవర్, 8.9 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఫ్యూయల్- ఇంజెక్ట్ ఇంజన్‌తో వస్తుంది. ఈ రెండు స్కూటర్లు దాదాపు 105 కిలోల బరువుతో పవర్-టు- వెయిట్ నిష్పత్తితో వస్తుంది.
జూపిటర్ ఇప్పుడు కొత్త డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఖాళీ ఇండికేటర్‌తో వస్తుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్, ఆటో స్టార్ట్- స్టాప్, రెండు హెల్మెట్లకు సరిపడా సీట్ స్టోరేజ్, ఆటోమేటిక్ టర్న్ సిగ్నల్ డీయాక్టివేషన్‌తో వస్తుంది. అంతేకాకుండా ఎల్ఈడీ లైటింగ్, టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ నావిగేషన్, ఫైండ్ మై స్కూటర్, రియల్ టైమ్ మైలేజ్, వాయిస్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుత యాక్టివాలో హెచ్-స్మార్ట్ వేరియంట్‌లో స్మార్ట్ కీ, కీలెస్ స్టార్ట్, ఎల్ఎస్ఈడీ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే యాక్టివా సీటు కింద ఒక్క హెల్మెట్కు సరిపడా నిల్వను మాత్రమే పొందుతుంది. అలాగే ఇంకా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉండదు. జూపిటర్ ఎలక్ట్రిక్ అసిస్ట్ టెక్నాలజీ కింద 55 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే హెూండా యాక్టివా లీటరుకు 50 కిమీ మైలేజీని కూడా పొందుతుంది.
2024 టీవీఎస్ జూపిటర్ ధర రూ.73,700 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది, అయితే హెచ్ స్మార్ట్ హోండా యాక్టివా ధర రూ.76,684 నుండి ప్రారంభమవుతుంది. అలాగే గరిష్ట ధర రూ.82,684 వరకు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి