Post Office MIS Scheme : కేవలం రూ.50,000 ఇన్వెస్ట్ చేసి నెలకు రూ. 3300 పెన్షన్ పొందండి..!

Post Office MIS Scheme : పోస్టాఫీసు పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడిని కూడా అందిస్తుంది.పెట్టుబడిదారులు భవిష్యత్‌లో ఆర్థిక పరిస్థితుల నుంచి విముక్తులు

Post Office MIS Scheme : కేవలం రూ.50,000 ఇన్వెస్ట్ చేసి నెలకు రూ. 3300 పెన్షన్ పొందండి..!
Post Office Mis Scheme

Updated on: Jul 31, 2021 | 6:49 PM

Post Office MIS Scheme : పోస్టాఫీసు పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడిని కూడా అందిస్తుంది.పెట్టుబడిదారులు భవిష్యత్‌లో ఆర్థిక పరిస్థితుల నుంచి విముక్తులు కావడానికి ఇండియా పోస్ట్ నెలవారీ ఆదాయ పథకాన్ని (MIS) ప్రవేశపెట్టింది. ఒక్కసారి పెట్టుబడి పెడితే సాధారణ పెన్షన్‌ని అందుకోవచ్చు. MIS పథకంలో మెచ్యూరిటీ ప్రయోజనాలను ఒక్కసారి తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ MIS స్కీమ్‌లో చేరాలంటే కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. ముగ్గురు కలిసి జాయింట్ ఖాతా తెరడానికి కూడా అవకాశం ఇస్తుంది. అలాంటప్పుడు పెట్టుబడిదారులు ఈ ఖాతాలో గరిష్ట పెట్టుబడి రూ.9 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఇండియా పోస్ట్ MIS ప్లాన్ పై 6.6% వార్షిక వడ్డీని అందిస్తోంది.

రూ.3300 వార్షిక పెన్షన్ తీసుకునేందుకు పెట్టుబడిదారులు ఇండియా పోస్ట్ అందించే MIS ప్లాన్‌లో రూ .50 వేలు డిపాజిట్ చేయాలి. ఈ పథకంలో మొత్తంగా పెట్టుబడిదారులకు ఐదేళ్ల వ్యవధిలో రూ.16,500 వడ్డీ లభిస్తుంది. పెట్టుబడిదారులు ఈ పథకంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ .550 నెలవారీ పెన్షన్ లభిస్తుంది. ఇదే మొత్తంలో, పెట్టుబడిదారులు ప్రతి సంవత్సరం రూ. 6600 లేదా ఐదు సంవత్సరాలలో రూ. 33000 పొందవచ్చు. నెలవారీ రూ .2475 లేదా సంవత్సరానికి రూ .2700 పెన్షన్ కోసం పెట్టుబడిదారులు ఈ పథకంలో రూ .4.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి.

మీరు పోస్ట్ ఆఫీస్ ప్రవేశ పెట్టిన ఎలాంటి ప్లాన్‌లోనైనా డబ్బు పెట్టుబడి పెడితే, మీరు మీ డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు ఉన్నాయి. దీనిలో మీరు పెట్టుబడి పెడితే.. మీరు కొన్ని సంవత్సరాలలో కోటీశ్వరుడు కావచ్చు. కరోనా వ్యాప్తితో ప్రజలు ఇప్పటికే ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది పెట్టుబడిదారులు తమకు తక్కువ రిస్క్ ఉన్న మంచి రాబడిని పొందగల ఎంపిక కోసం చూస్తున్న సంగతి తెలిసిందే.

Personal vs Gold Loan : పర్సనల్ లోన్ వర్సెస్ గోల్డ్ లోన్..! ఈ రెండిటిలో ఏది బెటర్.. తెలుసుకోండి..

మిజోరంతో కయ్యం…నాగాలాండ్ తో ‘నెయ్యం’ ! అస్సాం ప్రభుత్వ వ్యూహం.. బోర్డర్స్ లో శాంతికి అంగీకారం

High Court: వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి, ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా ప్రత్యక్ష విచారణ: హైకోర్టు