యూపీఐ ఈ మూడు అక్షరాలు ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థని మార్చేశాయి. దీనికి గల ప్రధాన కారణం డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి రావడం. యూపీఐ ఐడీలు అందుబాటులోకి వచ్చాక చిన్న బడ్డీ కొట్టు మొదలు స్టార్ హోటల్స్ వరకూ అన్ని చోట్ల స్కాన్ కొట్టి పేమెంట్స్ చేస్తున్నారు. దీని ప్రభావంతో లిక్విడ్ క్యాష్ క్యారీ చేసే వారి సంఖ్య బాగా తగ్గింది. ప్రతి ఏటా మన దేశంలో యూపీఐ లావాదేవీల ద్వారా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఈ యూపీఐ ఐడీ యూజర్స్‌కి షాక్ ఇచ్చింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏడాది కాలంగా ఉపయోగించకుండా ఉండే యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్లు డీయాక్టివేట్ చేయాలాని భావిస్తోంది. దీనికి సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ ఆధారిత యాప్స్ పనిచేయవని తెలిపింది. దీనికి సంబంధించి ఆదేశాలతో కూడిన సర్క్యూలర్‌ను అన్ని బ్యాంకులకు జారీ చేసింది. ఇప్పటికే యూపీఐ అకౌంట్‌ను వినియోగిస్తున్న కొందరికి నోటిఫికేషన్ కూడా పంపించింది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలను కూడా వెల్లడించింది. కొందరు కొత్తగా సిమ్ కార్డ్ తీసుకున్న క్రమంలో పాత సిమ్ కార్డును ఉపయోగించరు. వాటిని నెట్వర్క్ కంపెనీలు మూడు నుంచి ఆరు నెలల వ్యవధి దాటితే ఇతరులకు కేటాయిస్తుంది. ఈ ఉపయోగించని ఫోన్ నంబర్ బ్యాంకుల్లో అనుసంధానమై ఉంటుంది కనుక ఒకరికి చేరాల్సిన నగదు మరొకరికి ఖాతాలో పడే అవకాశం ఉంటుంది. అందుకే డిశంబర్ 31లోపూ బ్యాంకుల్లో ఇచ్చిన నంబర్లు, యూపీఐ ఐడీ యాక్టివేట్ అయి ఉండే నంబర్లు ఒకటిగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఫోన్ నంబర్ వేరు, యూపీఐ ఐడీ వేరుగా ఉంటే గమనించి వాటిని డీయాక్టివేట్ చేయాలని సూచించింది. ఈ రకమైన ఆదేశాలు కేవలం భద్రత, సురక్షితమైన లావాదేవీలు జరపడం కోసమే అని తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..