AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya Gold Price: పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డుల వేట!

Akshaya Tritiya Gold Price: ప్రస్తుతం బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గత పన్నెండేళ్లలో విపరీతంగా పెరుగుదల కనిపిస్తోంది. తులం బంగారం కొనాలన్నా భయపడే రోజులు వచ్చాయి. సామాన్యులు సైతం కొనలేని పరిస్థితి ఉంది. మరి గత పదేళ్లలో ఎంత ధర పెరిగిందో చూద్దాం..

Akshaya Tritiya Gold Price: పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డుల వేట!
Gold Record-Breaking
Subhash Goud
|

Updated on: Apr 18, 2026 | 3:07 PM

Share

Akshaya Tritiya Gold Price అక్షయ తృతీయ వేళ బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంలో ఒక భాగం. అయితే గడిచిన 12 ఏళ్లలో (2014 నుండి 2026 వరకు) బంగారం ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. 2026 నాటికి ఈ ధరలు ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

గత 10 సంవత్సరాలలో అంటే 2014 నుంచి 2026 వరకు దీని ధర దాదాపు 410 శాతం వరకు పెరిగింది. 2014 సంవత్సరంలో అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 30,000 మాత్రమే ఉండగా, 2024 నాటికి ఇది 218 శాతం పెరిగింది. ప్రస్తుతం అంటే 2026లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ. 1.50 లక్షలు దాటేసింది. ఇది 2014లో అక్షయ తృతీయ నాడు రూ. 30,182గా ఉంది.

అక్షయ తృతీయ: 2014 నుండి 2026 వరకు ధరల ప్రయాణం

2014లో అక్షయ తృతీయ నాడు 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.30,000 మాత్రమే ఉండేది. కానీ 2026 నాటికి ఇది సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకింది. 2014 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.30,182 ఉంది. 2015లో తులం ధర రూ.26,936 ఉంది. అంటే ఇక్కడ 11 శాతం మేర తగ్గుదల ఉందని గమనించవచ్చు. అలాగే 2016లో తులం ధర రూ.29,805 ఉంది ఇక్కడ 11 శాతం పెరుగుదల కనిపించింది.

2017లో తులం ధర రూ.28,879 ఉంది. ఇక్కడ 3 శాతమే పెరిగింది. 2018లో తులం బంగారం ధర రూ.31,534 వద్ద ఉంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 9 శాతం పెరుగుదల ఉంది. ఇక 2019లో తులం బంగారం ధర రూ.31,729 ఉంది. ఇక్కడ కేవలం 1 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. ఇక 2020లో తులం బంగారం ధర రూ.46,527 వద్ద కొనసాగింది. ఇక్కడ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే కోవిడ్‌ ప్రభావంతో ఏకంగా 47 శాతం పెరిగింది.

ఇక 2021లో తులం బంగారం ధర రూ.47,676 వద్ద కొనసాగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2 శాతం పెరుగుదల కనిపించింది. 2022లో తులం బంగారం ధర రూ.50,808 వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 7 శాతం పెరుగుదల. ఇక 2023 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.59,845 వద్ద ఉంది. ఇక్కడ 18 శాతం వరకు పెరుగుదల కనిపించింది.

Akshaya Tritiya: మహిళలకు గుడ్‌న్యూస్‌.. 50 శాతం తగ్గింపుతో మతిపోగొట్టే ఆఫర్‌!

2024లో తులం బంగారం ధర రూ.73,240 ఉంది. ఇక్కడ అంతకు ముందు ఏడాది ధరతో పోలిస్తే 222 శాతం వరకు పెరుగుదల ఉంది. 2025 సంవత్సరంలో తులం బంగారం ధర రూ.95,900 వరకు ఉంది. ఇక్కడ 31 శాతం వరకు పెరుగుదల ఉంది. ఇక ప్రస్తుతం ఏడాది 2026లో తులం బంగారం ధరను పరిశీలించినట్లయితే రూ.1,54,200 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ అంతకు ముందు ఏడాదితో పోల్చినట్లయితే ఏకంగా 50 శాతం వరకు ఎగబాకింది. అయితే ఇటీవల కాలంలో తులం బంగారం ధర దాదాపు 2 లక్షల రూపాయల చేరువలోకి వెళ్లింది. కానీ మళ్లీ క్రమంగా దిగి వస్తూ ఈ ధరకు చేరుకుంది.

Gold Jewellery: బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు అవుతుంది?

2026లో బంగారం ధర ఎందుకు పెరిగింది?

ప్రస్తుతం అంటే 2026 అక్షయ తృతీయ (ఏప్రిల్ 19) సమయానికి బంగారం ధర సరికొత్త రికార్డులను సృష్టించింది. దీనికి ప్రధాన కారణాలు: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: గడిచిన ఏడాది కాలంగా అంతర్జాతీయంగా చోటుచేసుకున్న యుద్ధ మేఘాలు (ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు) పెట్టుబడిదారులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించాయి. ద్రవ్యోల్బణం, డాలర్ విలువ: ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల బంగారం డిమాండ్ పెరిగింది. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్‌లో సరఫరా తగ్గి ధరలు పెరిగాయి.

12 ఏళ్లలో 400% పైగా పెరుగుదల

2014లో కేవలం రూ.30,000 ఉన్న బంగారం, 2026 నాటికి రూ.1.54 లక్షలు దాటడం విశేషం. అంటే గత 12 ఏళ్లలో బంగారం ధర సుమారు 410% పైగా పెరిగింది. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అది అక్షయం (తరగనిది) అవుతుందనే నమ్మకంతో పాటు, పెట్టుబడి పరంగా కూడా ఇది అత్యుత్తమ లాభాలను అందించే ఆస్తిగా నిలిచింది.

గమనిక: పైన పేర్కొన్న 2026 ధరలు మార్కెట్ ఒడిదుడుకులు, నగరాల వారీగా స్వల్పంగా మారవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో నిపుణులు బంగారంపై దీర్ఘకాలిక పెట్టుబడి లాభదాయకమని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Akshay Tritiya: అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం, వెండి ధరలపై కేంద్రం బిగ్ డెసిషన్‌.. పసిడి దిగివస్తుందా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఖరీదైన కలర్స్‌ వద్దు.. వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే..
ఖరీదైన కలర్స్‌ వద్దు.. వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే..
ఒక్కసారి డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెలా రూ.9,250 ఆదాయం..!
ఒక్కసారి డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెలా రూ.9,250 ఆదాయం..!
ప్రవేశ పరీక్షలకు 2026 వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో అనుమతి
ప్రవేశ పరీక్షలకు 2026 వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో అనుమతి
బిగ్ బాస్ వల్ల నాకు తమర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే
బిగ్ బాస్ వల్ల నాకు తమర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే
రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డు
పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డు
పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు
ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు
చికెన్ స్కిన్ తింటే బాడీలో ఇన్ని జరుగుతాయా..? తినేముందు ఈ విషయాలు
చికెన్ స్కిన్ తింటే బాడీలో ఇన్ని జరుగుతాయా..? తినేముందు ఈ విషయాలు
ఛీ ఇదేం సాంగ్ అన్నారు.. అదే పాటతో చిరంజీవి హిట్టు కొట్టారు..
ఛీ ఇదేం సాంగ్ అన్నారు.. అదే పాటతో చిరంజీవి హిట్టు కొట్టారు..