Telecom Companies May Increase Tariff Plans: రానున్న రోజుల్లో ఇంటర్‌నెట్, ఫోన్ కాల్స్ ధరలు భారీగా పెరగనున్నాయా.? టెలికామ్ కంపెనీలు టారిఫ్ ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయా.? అంటే అవుననే సమాధానం వస్తోంది.
జియో రాకతో టెలికామ్ కంపెనీల మధ్య పెరిగిన పోటీతో టారిఫ్ ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని కంపెనీలు ఇటు ఇంటర్‌నెట్‌తో పాటు వాయిస్ కాల్స్ ధరలను కూడా తగ్గించాయి. అయితే తాజాగా ఏప్రిల్ 1 నుంచి టెలికామ్ కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) ప్రకారం.. దాదాపు అన్ని టెలికామ్ కంపెనీలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా టెలికామ్ కంపెనీలు 5జీలోకి అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయని, ఈ ఏర్పాటుకు కావాల్సిన నిధులను సేకరించే క్రమంలోనే ధరలను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ధర ఎంతమేర పెరగనున్నాయనే విషయం మాత్రం ఇంకా అధికారింగా తెలియరాలేదు. టారిఫ్ పెంచడం, వినియోగదారులు 2జీ నుంచి 4జీకి మారడం ద్వారా రెవనెన్యూ పెరిగే అవకాశం ఉందని ఐసీఆర్ఏ అభిప్రాయపడింది. దీనివల్ల టెలికామ్ కంపెనీల ఆదాయం రానున్న రెండేళ్లలో 11 నుంచి 13 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే దాదాపు అన్ని రంగాలపై ప్రభావం చూపిన కరోనా మహమ్మారి టెలికాం రంగంపై పెద్దగా ప్రభావం చూపకపోవడం విశేషం. అందులోనూ వర్క్ ఫ్రమ్ హోం కల్చర్, ఆన్‌లైన్ క్లాస్‌లు పెరగడంతో ఇంటర్‌నెట్ వినియోగం బాగా పెరగడంతో టెలికాం సంస్థలకు ఇది కలిసొచ్చింది. ఇక చివరిగా 2019 డిసెంబర్‌లో టారిఫ్ ధరలను పెంచారు. మరి టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచనున్నాయని వస్తోన్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికలు.. వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతల ఆందోళన
PI BEEM: ఇది సైకిల్‌కు ఎక్కువ.. స్కూటర్‌కు తక్కువ.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం..