AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Government Schemes: మీరు ఈ ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టారా..! అయితే మీకు డబ్బే డబ్బు.. ఒక్కసారి పరిశీలించండి..

Best Government Schemes: ప్రజలు తమ డబ్బును రెట్టింపు చేసుకోవడానికి వివిధ స్కీంల గురించి వెతుకుతుంటారు. అయితే ప్రభుత్వం వీరి గురించి ఆలోచించి

Government Schemes: మీరు ఈ ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టారా..! అయితే మీకు డబ్బే డబ్బు.. ఒక్కసారి పరిశీలించండి..
uppula Raju
|

Updated on: Feb 17, 2021 | 12:26 PM

Share

Best Government Schemes: ప్రజలు తమ డబ్బును రెట్టింపు చేసుకోవడానికి వివిధ స్కీంల గురించి వెతుకుతుంటారు. అయితే ప్రభుత్వం వీరి గురించి ఆలోచించి సురక్షితమైన పథకాలను ప్రవేశపెట్టింది. ఎటువంటి నష్టాలు రాకుండా పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు అందిస్తోంది. ప్రభుత్వ మద్దతుతో నిర్వహించే ఈ పథకాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, తపాలా కార్యాలయాల ద్వారా అమలవుతాయి. అలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అత్యత్తమ ఇన్వెస్ట్‌మెంట్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. గవర్నమెంట్ సెక్యూరిటీస్ (G-Secs): గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో 91 రోజుల నుంచి 40 ఏళ్ల వరకు వివిధ మెచ్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి సార్వభౌమ పెట్టుబడులు కాబట్టి డిఫాల్ట్ రిస్క్ ఉండదు. వడ్డీ పైన ఎలాంటి టీడీఎస్ వర్తించదు. గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ కరెంట్ డీమ్యాట్ అకౌంట్‌లో స్టోర్ అవుతాయి. సెకండరీ మార్కెట్లో వేగంగా ట్రేడ్ అవుతాయి.

2. సావరీన్ గోల్డ్ బాండ్స్: భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం తరఫున ఆర్బీఐ వీటిని జారీ చేస్తుంది. స్టోరేజ్ ఖర్చులు, రిస్క్ ఉండదు. బంగారం కొనుగోలు వల్ల ఉండే మేకింగ్ ఛార్జీలు, ఇతర సమస్యలు ఉండవు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి అర్హులు.

3. అటల్ పెన్షన్ యోజన: అసంఘటిత రంగాలలోని కార్మికులకు పెన్షన్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని ప్రకటించింది. పేద కార్మికులకు ఉద్యోగ విరమణ అనంతరం వారి వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కోసం ఈ పథకాన్ని 2015-16 బడ్జెట్‌లో ప్రవేశ పెట్టారు. ఇందులో చేరిన వారు నిర్ణీత సమయంలో చెల్లించిన మొత్తానికి పెన్షన్ అందిస్తారు. APY ఖాతాదారు హఠాత్తుగా మరణిస్తే ఆటోమేటిక్‌గా నామినీగా ఉండే భార్యకు వెళ్తుంది. 1961లోని సెక్షన్ 80 సిసిడి కింద అటల్ పెన్షన్ యోజన ఖాతాదారులకు పన్ను మినహాయింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని జమ చేస్తుంది.

4. నేషనల్ పెన్షన్ స్కీం: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అతారిటీ(PFRDA) చేత నిర్వహించబడే సహకార విరమణ పథకం. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సులోని వారు ఈ పథకంలో చేరవచ్చు. స్కీంలో చేరిన సమయంలో ప్రతి NPS సభ్యుడికి ఒక పోర్టబుల్ పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PRAN) కేటాయిస్తారు. కాంట్రిబ్యూషన్‌లో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఎన్పీఎస్ అనేక పెట్టుబడి అవకాశాలను, పెన్షన్ ఫండ్స్ ప్రాధాన్యతను అందిస్తుంది. NPS ఖాతా తెరవడం సులభం.

5. సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, ఆర్థిక భరోసా ఇచ్చే పథకాలను ప్రవేశపెట్టింది మోడీ ప్రభుత్వం. ఆడపిల్లల పేరు మీద ఈ ఖాతాను బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో తెరవచ్చు. వీరి భవిష్యత్తుకు సంబంధించిన చిన్న మొత్తాల పొదుపు పథకం ఇది. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద సేవింగ్స్ చేస్తున్న తల్లిదండ్రులకు పన్ను మినహాయింపు ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఒక ఆర్థిక సంవత్సరానికి గాను కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. ఖాతా ఓపెన్ చేసిన సమయం నుంచి 21 ఏళ్లకు ఈ ఖాతా సమయం పూర్తవుతుంది. ఇవే కాకుండా, పీపీఎప్ పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రావిడెండ్ ఫండ్ ఉంది. ప్రధానమంత్రి వయవందన యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి వివిధ స్కీమ్స్ ఉన్నాయి.

ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి..