Work From Home Plans: గత సంవత్సరం లాక్ డౌన్ సందర్భంగా..టెలికాం కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టాయి. ఈ ప్లాన్ లతో చాలా మంది వినియోగదారులు తమ వర్క్ ఫ్రం హోమ్ కార్యకలాపాలను సాగించారు. ఈ సంవత్సరం కూడా కరోన రెండో వేవ్ కారణంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ఇప్పుడు కూడా చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీంతో టెలికాం కంపెనీలు ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా డాటా కొనుగోలు కోసం వినియోగదారులకు చాలా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్, జియో, వీఐ డాటా ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇంటి నుంచి పనిచేస్తున్న వారికోసం అందిస్తున్నాయి. ఎయిర్ టెల్ ఇప్పటివరకూ అటువంటి ప్లాన్స్ ప్రత్యేకంగా అందించకపోయినా మామూలుగా వినోద కార్యక్రమాలతో అందించే ప్రత్యెక డాటా ప్లాన్లు వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేసేవారికి ఉపయోగకరంగా ఉన్నాయి.
బీఎస్ఎన్ఎల్ 151 రూపాయల నుంచి 251 రూపాయల వరకూ వర్క్ ఫ్రం హోమ్ ప్లాన్స్ అందిస్తోంది. ఈ రెండు ప్లాన్లు కూడా 28 రోజుల వ్యాలిడిటీ తొ 40 జీబీ అలాగే 70 జీబీ డాటాను వినియోగదారులకు అందచేస్తున్నాయి. ఈ రెండు ప్లాన్లూ పూర్తిగా డాటా ప్లాన్లు. ఒకవేళ కాలింగ్ ప్లాన్ కావాలంటే మళ్ళీ ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వీఐ 251 రూపాయలు అలాగే 351 రూపాయల ప్లాన్లను వర్క్ ఫ్రం హోమ్ సెక్షన్ కి అందిస్తోంది. 251 రూపాయల ప్లాన్ లో 28 రోజుల కాలపరిమితికి 50 జీబీ డేటా అందిస్తోంది. దీంతో పాటు వీఐ మూవీస్ అలాగే టీవీని ఉచితంగా చూసే అవకాశమూ ఉంటుంది. ఇక 351 రూపాయల ప్లాన్ లో 100 జీబీ డేటా 56 రోజులకు అందిస్తోంది వీఐ. దీనికి కూడా వీఐ మూవీస్ అలాగే టీవీని ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది.
జియో 151 రూపాయలు.. 201 రూపాయల డాటా ప్లాన్స్ అందిస్తోంది. 30 జీబీ.. 40 జీబీ డేటా ను నెల రోజుల పాటు ఈ ప్లాన్ల నుంచి ఉపయోగించుకోవచ్చు. అలాగే జియో 251 వర్క్ ఫ్రం హోమ్ ప్లాన్ కూడా అందిస్తుంది.. దీనిలో భాగంగా 30 రోజులకు 50 జీబీ డేటాను అందిస్తోంది.
ఎయిర్ టెల్ 98 రూపాయల డాటా ఓన్లీ ప్లాన్ అందరు ఎయిర్ టెల్ యూజర్ల కోసం అందిస్తోంది. ఈ ప్లాన్లో 12 జీబీ డాటాను ఇప్పుడు ఉన్న ప్లాన్ తొ పాటుగా ఉపయోగించుకోవచ్చు. అంటే, ఇప్పుడు మీరు ఉపయోగిస్తున్న ప్లాన్ కు అదనంగా 98 రూపాయల రీఛార్జ్ చేస్తుకుంటే ఆ ప్లాన్ పూర్తయ్యేవరకూ 12 జీబీ డాటాను ఉపయోగించుకునే వీలుంటుంది. ఎయిర్ టెల్ లో ప్రత్యేకంగా వర్క్ ఫ్రం హోమ్ ప్లాన్స్ లేవు. అయితే, 131 రూపాయల, 248 రూపాయల డేటా ఓన్లీ ప్లాన్స్ ద్వారా డేటాను పొందవచ్చు. 131 రూపాయల ప్లాన్ ద్వారా 100 ఎమ్బీ డాటా వస్తుంది. దీంతో పాటు అమెజాన్ ప్రైం నెల రోజుల పాటు చూడొచ్చు. ఇక ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీం, హలో ట్యూన్స్ వింక్ మ్యూజిక్ ఉచితంగా లభిస్తాయి. అదేవిధంగా 248 రూపాయల ప్లాన్ లో 25 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు వింక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ రెండూ కూడా ఎయిర్ టెల్ లో మీరు ప్రస్తుతం వాడుతున్న ప్లాన్ వ్యాలిడిటీ కి అనుబంధంగా మాత్రమె ఉంటాయి.