
T-Wallet: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్‌ను మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టీ-వాలెట్ (T-Wallet) ఖాతాల్లోకి నేరుగా క్రెడిట్ కార్డులతో నగదు జమ చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. క్రెడిట్ కార్డు ద్వారా టీ-వాలెట్‌కి నేరుగా డబ్బులు పంపించుకునే సౌలభ్యం కల్పించారు. దీన్ని IMPS ద్వారా అమలు చేయనున్నారు. దీంతో డబ్బులు వెంటనే క్రెడిట్ అయ్యే చాన్స్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ ఎంత అలసిపోయినా ఆ పని చేయందే నిద్రపోరట.. అంబానీ లైఫ్‌స్టైల్ గురించి మీకు తెలుసా?
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే వినియోగదారులపై భారం పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే క్రెడిట్ కార్డ్ ద్వారా జమ చేసే డబ్బుపై గరిష్ఠంగా 2 శాతం సర్వీస్ చార్జీ మాత్రమే ఉంటుందని మంత్రి తెలిపారు. టీ-వాలెట్ వినియోగం రాష్ట్రవ్యాప్తంగా వేగంగా పెరుగుతోందని మంత్రి వివరించారు. ఏడాదిలో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా జరగిన లావాదేవీలు రూ.4,400 కోట్లు దాటినట్లు వివరించారు. ఇది రాష్ట్రంలో డిజిటల్ వ్యవస్థ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో వివరిస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Bank Alert: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? మీకో బిగ్ అలర్ట్.. ఆగస్టు 8 వరకు గడువు.. లేకుంటే అకౌంట్ క్లోజ్!
ఈ కొత్త సదుపాయం వల్ల ప్రజలు మరింతగా డిజిటల్ పేమెంట్స్ వైపు వెళ్లే అవకాశం ఉందని, క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారికి ఇది బాగా యూజ్ అవుతుందని మంత్రి తెలిపారు. ఇకపై ఎటువంటి ఆలస్యం లేకుండా టీ-వాలెట్ ఖాతాలో డబ్బులు జమ చేసుకోవచ్చన్నారు.
ఇది కూడా చదవండి: రూ.6.29 లక్షలకే 7 సీటర్స్ కారు.. 6 ఎయిర్ బ్యాగ్స్.. చౌకైన కారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి