
ఉబెర్, ఓలా, రాపిడో వంటి ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్లు నిర్ణయం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. కిలోమీటరు ఛార్జీలను తగ్గించినందున తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యుయు) కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం, ఏప్రిల్ 8వ తేదీన ‘నో ఎసి క్యాంపెయిన్’ ప్రకటించింది. @TGPWU పరిధిలోని #Uber , #Ola , #Rapido యాప్‌లతో పనిచేస్తున్న డ్రైవర్‌లు కిలోమీటరుకు తగ్గుతున్న ధరల కారణంగా తమ క్యాబ్‌లలో ACని ఆన్ చేయలేకపోతున్నామని ప్రకటించారు. తమ క్యాబ్‌లను ఏసీతో నడపాలంటే కిలోమీటరుకు అదనంగా రూ. 16-18 ఖర్చు అవుతుందని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నేరుగా ఆయా సంస్థలే అధికారికంగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలు వసూలు చేస్తున్న కమీషన్‌ల ద్వారా డ్రైవర్లు కిలోమీటరుకు రూ. 10-12 రూపాయలు మాత్రమే పొందగలుగుతున్నారని గిగ్ వర్కర్ సంఘాలు తెలిపాయి. ఈ విషయంపై తమ క్యాబ్ ఎక్కిన కస్టమర్లందరూ.. రైడ్‌ల సమయంలో AC అవసరమైతే దానికి తగిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపైన్ లో తమకు సహకరించండి అని కోరినట్లు తెలిపారు. అలాగే తమ డిమాండుకు సరిపడా చిట్కాను అందించమని కస్టమర్లను అభ్యర్థిస్తున్నాము అని తెలిపారు.
అక్రమ క్యాబ్ సేవలపై కఠిన చర్యలు తీసుకోవాలని, సిటీ ట్యాక్సీలు, యాప్ ఆధారిత ట్యాక్సీలకు ఒకే రకమైన ఛార్జీలను అమలు చేయాలని యూనియన్ ఇటీవల రాష్ట్ర రవాణా కమిషనర్‌కు విజ్ఞప్తి చేసింది. ఆంధ్రా, కర్నాటక హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు తాత్కాలిక పర్మిట్‌లతో తెలంగాణలో క్యాబ్ సర్వీస్‌లు నడుపుతున్నాయని తెలిపింది. ఇలా అక్రమ మార్గాల్లో రవాణా సేవలు కొనసాగిస్తున్నారని వర్కర్స్ యూనియన్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌కు రాసిన లేఖలో పేర్కొంది.
తమ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత రాష్ట్రం విడిచి వెళ్లడానికి బదులుగా, ఈ వాహనాలు ఓలా, ఉబర్, రాపిడో సంస్ధలతోనే కాకుండా ఇతర ఐటీ కంపెనీల నుండి యాప్ ఆధారిత రైడ్-హెయిలింగ్ లేదా షేరింగ్ సేవలపై పని చేస్తాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పల్, ఎల్‌బీ నగర్, ఆరామ్‌ఘర్, బీహెచ్‌ఈఎల్ క్రాస్ రోడ్లు, ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో వాహన తనిఖీలు పెంచాలని ఉద్యోగుల సంఘం సూచించింది. పండుగ సమయంలో ప్రైవేట్ వాహనాల ద్వారా అక్రమ క్యాబ్ సేవలు పెరుగుతాయని వివరించారు. ఇది యాప్ లతో అనుసంధానమైన క్యాబ్ డ్రైవర్లపై ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని లేఖలో పేర్కొన్నారు.
After accounting for commissions charged by #Uber #Ola & #Rapido, we are able to earn only rupees 10-12 per km. All our customers on this matter. If they require the AC to be switched on during rides, we request them to kindly offer us a tip to help us adequately meet the costs. pic.twitter.com/t1sGRGpexz
— Telangana Gig and Platform Workers Union (@TGPWU) April 8, 2024
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..