AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Benefits: నిర్మాణంలో ఉన్న ఆస్తులపై కూడా పన్ను ప్రయోజనాలు.. ఆ తేదీతోనే అసలు సమస్య

భారతదేశంలో నిర్మాణంలో ఉన్న ఆస్తులకు సంబంధించిన పన్ను నియమాల గురించి పన్ను చెల్లింపుదారులు తరచుగా గందరగోళానికి గురవుతారు. నిర్మాణంలో ఉన్న లేదా ముందస్తు స్వాధీనం కాలం అనేది గృహ రుణం ప్రారంభం లేదా పరిశీలనలో ఉన్న ఆస్తి నిర్మాణాన్ని పూర్తి చేయడం మధ్య వ్యవధిని సూచిస్తుంది. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం గృహ కొనుగోలుదారు ఇంటిని స్వాధీనం చేసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి 5 సమాన వాయిదాలలో నిర్మాణంలో ఉన్న ఆస్తి కోసం రుణంపై పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.

Tax Benefits: నిర్మాణంలో ఉన్న ఆస్తులపై కూడా పన్ను ప్రయోజనాలు.. ఆ తేదీతోనే అసలు సమస్య
Income Tax
Nikhil
|

Updated on: Jun 11, 2024 | 3:40 PM

Share

భారతదేశంలో నిర్మాణంలో ఉన్న ఆస్తులకు సంబంధించిన పన్ను నియమాల గురించి పన్ను చెల్లింపుదారులు తరచుగా గందరగోళానికి గురవుతారు. నిర్మాణంలో ఉన్న లేదా ముందస్తు స్వాధీనం కాలం అనేది గృహ రుణం ప్రారంభం లేదా పరిశీలనలో ఉన్న ఆస్తి నిర్మాణాన్ని పూర్తి చేయడం మధ్య వ్యవధిని సూచిస్తుంది. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం గృహ కొనుగోలుదారు ఇంటిని స్వాధీనం చేసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి 5 సమాన వాయిదాలలో నిర్మాణంలో ఉన్న ఆస్తి కోసం రుణంపై పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. అయితే అలాంటి ఆస్తుల అమ్మకంపై మూలధన లాభాల పన్నుకు సంబంధించినది నిపుణులు చెబుతున్నారు. పన్ను బాధ్యత విషయానికి వస్తే, ఆదాయపు పన్ను (ఐటి) చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం స్వాధీనం చేసుకున్న తేదీని పరిగణనలోకి తీసుకోవాలని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటిఎటి) ముంబై బెంచ్ ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఐటీ యాక్ట్ సెక్షన్ 54 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఒక నిర్దిష్ట వ్యవధిలోపు కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి వచ్చే ఆదాయాన్ని పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే ఇంటిని విక్రయించిన తర్వాత పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. అంటే ఒక ఇంటి నుంచి వచ్చిన ఆదాయం కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి పెట్టుబడి పెట్టినప్పుడు పాత ఇంటిని విక్రయించడం ద్వారా వచ్చిన లాభంపై చెల్లించాల్సిన పన్ను తక్కువగా వస్తుంది. ఐటీ చట్టాల ప్రకారం పాత ఇంటిని విక్రయించిన ఏడాది ముందు లేదా రెండేళ్లలోపు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి. ప్రత్యామ్నాయంగా పాత ఆస్తిని విక్రయించిన తేదీ నుంచి మూడు సంవత్సరాలలోపు తన కొత్త నివాస ప్రాపర్టీని నిర్మించుకోవాలి. ఐటీఏటీ తీర్పు విషయానికి వస్తే ఇది ఎఫ్‌వై 2010-11కి సంబంధించి ఒక నాన్-రెసిడెంట్‌ కేసుకు సంబంధించినది నిపుణులు వివరిస్తున్నారు. అయితే మూలధన లాభాలపై పన్ను మినహాయింపును ఆదాయపు పన్ను శాఖ అనుమతించలేదు. వాస్తవానికి ఈ విషయం ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 54కు సంబంధించిందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా పాత ఆస్తి నుండి వచ్చిన మూలధన లాభాలపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసే తేదీకి సంబంధించినదని పేర్కొంటున్నారు. 

సెక్షన్ 54 ప్రకారం పన్ను ప్రయోజనాలు ఇలా

ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, నిర్దిష్ట పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను చెల్లింపుదారులు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పెట్టుబడులు ఐటీ చట్టాల్లో సెక్షన్ 54 నుండి 54 జీబీ వరకు వివరించిన మార్గదర్శకాల ప్రకారం ఉండాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం పన్ను చెల్లింపుదారు నివాస గృహంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి అనుమతి ఉంటుంది. పాత ఇంటిని విక్రయించిన రెండు సంవత్సరాలలోపు లేదా ఆస్తిని విక్రయించడానికి ఒక సంవత్సరం ముందు కొత్త నివాస గృహాన్ని కొనుగోలు చేస్తే సెక్షన్ 54 ప్రకారం దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చని పన్ను చట్టాలు చెబుతున్నాయి. కొత్త ఇంటిని విక్రయించిన తేదీ నుంచి మూడేళ్లలోపు నిర్మిస్తే పన్ను ప్రయోజనం కూడా అనుమతి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఆ విజయం లక్ కాదు.. విమర్శకులకు బవుమా అదిరిపోయే కౌంటర్
ఆ విజయం లక్ కాదు.. విమర్శకులకు బవుమా అదిరిపోయే కౌంటర్
హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లలో DDLJ.. షారుఖ్ బర్త్‌డే స్పెషల్
హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లలో DDLJ.. షారుఖ్ బర్త్‌డే స్పెషల్
న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం..!
న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం..!
కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే
కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే
వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా
వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా
టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్
టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్
ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..
ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..
ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!
ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!
ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్
ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్