EV Cycles: ఈవీ రంగంలోకి టాటా ఎంట్రీ.. అదిరే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్‌ సైకిల్స్‌ లాంచ్‌

|

Sep 22, 2024 | 3:57 PM

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో ఇటీవల కాలంలో కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ హవా చూపేందుకు ఈవీ రంగంలో అడుగుపెడుతున్నాయి. అయితే భారతదేశ కంపెనీ అయిన టాటా గ్రూప్‌ కూడా ఈవీ రంగంలోకి అడగుపెట్టనుంది. టాటా గ్రూప్ కంపెనీ స్ట్రైడర్ సైకిల్ వోల్టిక్ ఎక్స్, వోల్టిక్ గో అనే రెండు కొత్త ఎలక్ట్రిక్‌ సైకిళ్ల మోడళ్లను విడుదల చేసింది.

EV Cycles: ఈవీ రంగంలోకి టాటా ఎంట్రీ.. అదిరే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్‌ సైకిల్స్‌ లాంచ్‌
Tata Voltics X
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో ఇటీవల కాలంలో కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ హవా చూపేందుకు ఈవీ రంగంలో అడుగుపెడుతున్నాయి. అయితే భారతదేశ కంపెనీ అయిన టాటా గ్రూప్‌ కూడా ఈవీ రంగంలోకి అడగుపెట్టనుంది. టాటా గ్రూప్ కంపెనీ స్ట్రైడర్ సైకిల్ వోల్టిక్ ఎక్స్, వోల్టిక్ గో అనే రెండు కొత్త ఎలక్ట్రిక్‌ సైకిళ్ల మోడళ్లను విడుదల చేసింది. ఈ రెండు సైకిళ్లపై ప్రస్తుతం 16 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. వాయుకాలుష్యంతో పాటు పట్టణ ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ఈ ఈ-సైకిళ్లు కచ్చితంగా ప్రజలను ఆకట్టుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ రెండు ఈ-సైకిళ్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టాటా స్ట్రైడర్‌కు సంబంధించిన వోల్టిక్‌ ఎక్స్‌  ప్రారంభ ధర రూ. 32,495గా ఉండగా వోల్టిక్‌ గో ధర రూ. 31,495. ఈ రెండు సైకిళ్లు 48వీ స్ప్లాష్ ప్రూఫ్ బ్యాటరీతో వస్తున్నాయి. అందువల్ల ఈ-సైకిళ్లు కేవలం మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి. అలాగే ఒక్కో ఛార్జ్‌కు 40 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి ముఖ్యంగా ఈ సైకిల్‌ వోల్టిక్ జీఓ ఫ్రేమ్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఇది రైడర్‌లకు సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని అందిస్తుంది. వోల్టిక్ ఎక్స్‌ మౌంటేన్‌ బైక్-శైలి డిజైన్‌తో వస్తుంది. ఇది పట్టణ ప్రయాణాలతో పాటు తేలికపాటి ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌లకు అనువైనది. ఈ రెండు మోడళ్లలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి, మెరుగైన భద్రత కోసం ఆటోమేటిక్ పవర్ కట్-ఆఫ్‌తో వస్తాయి. దీనికి రెండేళ్ల బ్యాటరీ వారంటీ ఉంది.

ఈ-బైక్‌ల జనాదరణ పెరగడంతో పాటు సాంప్రదాయ సైక్లింగ్ అనుభవాన్ని అందించే ఈ సైకిళ్లు పర్యావరణ అనుకూల రవాణా మార్గాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త ఈ-బైక్ మోడల్స్ వోల్టిక్ ఎక్స్‌, వోల్టిక్ గో సైకిళ్లు పట్టణ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూపొందించామని టాటా ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే టాటా స్ట్రైడర్ భారతదేశంలోని 4,000 రిటైల్ అవుట్‌లెట్‌లకు దాని పాదముద్రను విస్తరించింది మరియు సార్క్, ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్య దేశాలకు దాని ఎగుమతి కార్యకలాపాలను విస్తరించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతూనే ఉంది, స్ట్రైడర్ యొక్క తాజా ఇ-బైక్ ఆఫర్‌లు గ్రీనర్ మొబిలిటీ సొల్యూషన్స్‌కు మారాలని చూస్తున్న వినియోగదారులకు మరింత స్థిరమైన రవాణా ఎంపికలను అందిస్తాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి