Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Electric Car: టాటా నుంచి మరో ఎలక్ట్రిక్ ఎస్ యూవీ.. మోడ్రన్ లుక్.. అదిరిపోయే ఫీచర్లు..

డిమాండ్ కు అనుగుణంగా కార్లు, బైక్ ల కంపెనీలు విరివిగా తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఒకదానికి మించిన రేంజ్ మరొకటి వస్తున్నాయి. ఈ క్రమంలోనే టాటా హారియర్ ను ఆటో ఎక్స్ పో లో ఆ కంపెనీ ప్రదర్శంచింది.

Tata Electric Car: టాటా నుంచి మరో ఎలక్ట్రిక్ ఎస్ యూవీ.. మోడ్రన్ లుక్.. అదిరిపోయే ఫీచర్లు..
Tata Harrier EV
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 19, 2023 | 4:39 PM

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దూసుకుపోతోంది. ఇప్పటికే పలు రకాల మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసిన టాటా.. ఇప్పుడు ఆటో ఎక్స్ పో 2023 వేదికగా మరో ఎస్ యూవీ మోడల్ ను ప్రదర్శించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పోటీ..

అంతర్జాతీయంగా అంతకంతకూ పెరుగుతున్న కాలుష్యం.. అదుపులోని ఇంధన ధరలు ప్రజలను ప్రత్నామ్నాయం వైపు ఆలోచించేలా చేస్తున్నాయి. ఫలితంగా అందరి దృష్టి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. దీంతో మార్కెట్లో ఈ వాహనాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ కు అనుగుణంగా కార్లు, బైక్ ల కంపెనీలు విరివిగా తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఒకదానికి మించిన రేంజ్ మరొకటి వస్తున్నాయి. ఈ క్రమంలోనే టాటా హారియర్ ను ఆటో ఎక్స్ పో లో ఆ కంపెనీ ప్రదర్శంచింది.

ఔటర్ లుక్ కొంచెం భిన్నంగా..

టాటా హారియర్ తన సంప్రదాయ ఇంధన మోడల్ కు ఎలక్ట్రిక్ వేరియంట్ దగ్గరగా ఉన్నప్పటికీ కొన్ని మార్పులు చేశారు. బయట లుక్ లో కొంచెం భిన్నంగా ఉంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉంది. ముందు భఆగంలో ఎల్ఈడీ స్ట్రిప్‌తో క్లోజ్-ఆఫ్ గ్రిల్‌తో వస్తోంది. అదే సమయంలో, హౌసింగ్ హెడ్‌ల్యాంప్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. వెనుక ప్రొఫైల్ విషయానికి వస్తే, హారియర్ EV టెయిల్ ల్యాంప్‌లతో వస్తోంది. వెనుక ప్రొఫైల్‌లో బోల్డ్ ‘Harrier.EV’ బ్యాడ్జింగ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో చంకీ రియర్ బంపర్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇంటీరియర్ ఇలా..

హారియర్ EVలో ఇచ్చిన డ్యాష్‌బోర్డ్ పాత మోడల్‌ లాగానే ఉంది. కానీ దాని లోపల ఫీచర్లు పెరిగాయి. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. యూజర్ ఇంటర్‌ఫేస్ అద్భుతంగా ఉంది. సెమీ-డిజిటల్ బినాకిల్‌కు బదులుగా 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను తీసుకొస్తున్నారు. లోపల మెరుగైన వాతావరణం కోసం ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ పక్కన యాంబియంట్ లైటింగ్ ఉంది. దీని స్పెసిఫికేషన్, ధర వంటి వివరాలు కంపెనీ వెల్లడించలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

లెమన్ వాటర్లో ఈ ఒక్కటి కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..
లెమన్ వాటర్లో ఈ ఒక్కటి కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..
మ్యాజిక్ డ్రింక్.. రాత్రిపూట తాగితే అమేజింగ్ అంతే..
మ్యాజిక్ డ్రింక్.. రాత్రిపూట తాగితే అమేజింగ్ అంతే..
ప్రకృతి ఒడిలో అందంగా, ఆనందంగా.. సమంత క్యూట్ ఫొటోస్ చూశారా!
ప్రకృతి ఒడిలో అందంగా, ఆనందంగా.. సమంత క్యూట్ ఫొటోస్ చూశారా!
గడ్డం బాబుల స్టైల్.. వారెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుంది! ఎలాగంటే
గడ్డం బాబుల స్టైల్.. వారెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుంది! ఎలాగంటే
పెట్టుబడి మంత్రంతో నోటీసుల కుతంత్రం చిత్తు..!
పెట్టుబడి మంత్రంతో నోటీసుల కుతంత్రం చిత్తు..!
రూ. 200కే బట్టతల మందు.. జెట్‌స్పీడ్‌గా జుట్టు తెప్పిస్తాడట..
రూ. 200కే బట్టతల మందు.. జెట్‌స్పీడ్‌గా జుట్టు తెప్పిస్తాడట..
ఈ చిత్రంలో మెదట చూసిన ఫేస్ మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుంది
ఈ చిత్రంలో మెదట చూసిన ఫేస్ మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుంది
మీ మైండ్ షార్ప్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
మీ మైండ్ షార్ప్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
ఎఫ్‌డీ ఖాతాదారులకు అలెర్ట్.. పెట్టుబడికి మూడు రోజులే గడువు
ఎఫ్‌డీ ఖాతాదారులకు అలెర్ట్.. పెట్టుబడికి మూడు రోజులే గడువు
ప్రైవేటు బ్యాంకులోనూ పీఎం విద్యాలక్ష్మీ లోన్.. ఇలా అప్లై చేయండి
ప్రైవేటు బ్యాంకులోనూ పీఎం విద్యాలక్ష్మీ లోన్.. ఇలా అప్లై చేయండి