టాటా నెక్సాన్ ఎస్ యూవీ ద్వారా గ్రాస్ ల్యాండ్ బీజ్, రాయల్ బ్ల్యూ అనే రంగులను పరిచయం చేశారు. ప్యూర్ ప్లస్, న్యూ క్రియేటివ్ ప్లస్, న్యూ క్రియేటివ్ ప్లస్ పీఎస్ అనే మూడు రకాల వేరియంట్లలో కొత్త కారును తీసుకువచ్చారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే వాయిస్ సహాయక పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేడెడ్ లెథెరెట్ సీట్లు, కొత్త 10.25 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లే, సబ్ వూఫర్ తో కూడిన 9 జేబీఎల్ స్పీకర్లు, ఇ-షిప్టర్, పాడిల్ షిప్టర్ తో కూడిన 7 స్పీడ్ డీసీఏ ఆకట్టుకుంటున్నాయి. పాత మోడల్ మాదిరిగానే కొత్త 2025 టాటా నెక్సాన్ లో ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ టర్బో చార్జ్ డ్ రెవో ట్రాన్ పెట్రోలు ఇంజిన్, 1.5 పెట్రోలు టర్బో చార్జ్ డ్ రెవో టార్క్ డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. 1200 సీసీ పెట్రోలు యూనిట్ నుంచి 5500 ఆర్ఫీఎం వద్ద 86.7 బీహెచ్ పీ, 1,750-4000 ఆర్పీఎం వద్ద 170 ఎన్ ఎం టార్కును ఉత్పత్తి అవుతుంది. ఈ ఇంజిన్ సీఎన్ జీ పవర్ ట్రైన్ ఎంపికలో కూడా ఉంది. ఆ మోడ్ లో 5000 ఆర్పీఎం వద్ద 72.5 బీహెచ్ పీ, 2000-3000 ఆర్పీఎం నుంచి 170 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. మరోవైపు 1500 సీసీ 3750 ఆర్పీఎం వద్ద 83.3 బీహెచ్పీ, 1500 నుంచి 2750 ఆర్ఫీఎం వరకూ 260 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది.
టాటా నెక్సాన్ కారులోని స్పెసిషికేషన్ల గురించి మాట్లాడుకోవాలంటే.. ఈ కాంపాక్ట్ ఎస్ యూవీ పొడవు 395 ఎంఎం, వెడల్పు 1804 ఎంఎం, ఎత్తు 1620 ఎంఎం, వీల్ బేస్ 2498 ఎంఎం, కారు గ్రౌండ్ క్లియరెన్స్ 208 ఎంఎంగా ఉన్నాయి. ఈ వాహనం బూట్ స్పేస్ 382 లీటర్ల కాగా సీఎన్ జీ వేరియంట్ లో 321 లీటర్ల వరకూ ఉంటుంది రెండే వేరియంట్ల ఇంధన ట్యాంకు కెపాసిటీ 44 లీటర్లు. నెక్సాన్ వేరియంట్ లైనప్ లో 16 అంగుళాల చక్రాలు మాత్రమే ఉన్నాయి. అయితే లో ఎండ్ లో ఇవి సాదా స్టీల్ వీల్స్ గా, హై ఎండ్ వేరియంట్లలో డైమట్ కట్ అల్లాయ్ వీల్స్ గా లభిస్తాయి.
తక్కువ ధరకు నాణ్యమైన కార్లను అందించడంలో టాాటా కంపెనీకి ఎంతో ప్రత్యేకత ఉంది. మధ్య తరగతి ప్రజలు కూడా కొనగలిగే ధరలో ఈ కార్లు అందుబాటులో ఉంటాయి. టాటా మోటార్స్ నుంచి వచ్చిన టియాగో, టిగోర్, నెక్సాన్ మోడళ్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇండియన్ మార్కెట్ లో మంచి విక్రయాలు జరిగి కంపెనీకి లాభాలు తెచ్చి పెట్టాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి