Tata Nexon: అమ్మకాల్లో ఆ టాటా కారు సరికొత్త రికార్డు.. ప్రత్యేక తగ్గింపులు ఇవే..!

దేశీయ కంపెనీల్లో టాటా కంపెనీ కార్లను వినియోగదారులు అమితంగా ఇష్టపడుతున్నారు. తాజాగా టాటా మోటార్స్ రిలీజ్ చేసిన నెక్సాన్ కారు ఓ సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. లాంచ్ చేసిన కేవలం 7 సంవత్సరాలలో 7 లక్షల యూనిట్లను విక్రయించింది. 2017లో ప్రారంభించిన నెక్సాన్ రిలీజ్ సమయం నుంచి దాని ప్రత్యేక ఫీచర్ల వినియోగదారుల ఆదరణ పొందింది.

Tata Nexon: అమ్మకాల్లో ఆ టాటా కారు సరికొత్త రికార్డు.. ప్రత్యేక తగ్గింపులు ఇవే..!
Tata Nexon Cng
Follow us
Srinu

|

Updated on: Jun 20, 2024 | 3:18 PM

భారతదేశంలో కార్ల అమ్మకాలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా దేశీయ కంపెనీలు తక్కువ ధరకే బడ్జెట్ ధరల్లో కార్లను లాంచ్ చేయడంతో సొంత కారు కొనుగోలు చేయాలనుకునే వారి కలను నెరవేర్చుకుంటున్నారు. దేశీయ కంపెనీల్లో టాటా కంపెనీ కార్లను వినియోగదారులు అమితంగా ఇష్టపడుతున్నారు. తాజాగా టాటా మోటార్స్ రిలీజ్ చేసిన నెక్సాన్ కారు ఓ సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. లాంచ్ చేసిన కేవలం 7 సంవత్సరాలలో 7 లక్షల యూనిట్లను విక్రయించింది. 2017లో ప్రారంభించిన నెక్సాన్ రిలీజ్ సమయం నుంచి దాని ప్రత్యేక ఫీచర్ల వినియోగదారుల ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో వరుసగా మూడు సంవత్సరాలు అంటే 2021 నుంచి 2023 వరకూ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా నిలిచింది. టాటా నెక్సాన్ భారతీయ కార్లు అయిన మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి కార్లకు గట్టి పోటినిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాటా నెక్సాన్ కార్లపై కంపెనీ ఇచ్చే తగ్గింపుల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

భారతదేశంలోని టాటా మోటార్స్ డీలర్షిప్స్ అత్యధికంగా అమ్ముడైన కారు టాటా నెక్సాన్ నిలవడంతో ఆ కారుపై కంపెనీ ప్రత్యేక తగ్గింపులను అందిస్తుంది. ముఖ్యంగా ఈ కారును బుక్ చేసుకుని డెలివరీ కోసం చూస్తున్న కస్టమర్లకు దాదాపు రూ.లక్ష వరకూ ప్రత్యేక తగ్గింపులను ఇస్తుంది. ఇటీవల టాటా నెక్సాన్ గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి నుండి 5-స్టార్ రేటింగ్  పొందిన భారతదేశంలో మొట్టమొదటి కారుగా నిలిచింది. ఫిబ్రవరి 2024లో 2022 జీఎన్‌సీఏపీ ప్రోటోకాల్ కింద 5 స్టార్ రేటింగ్ లభించినందున క్రాష్ టెస్టుల్లో కూడా ఈ కారు ప్రత్యేకంగా నిలిచింది. అలాగే ఇటీవల తాజాగా నెక్సాన్ ఈవీ కూడా క్రాష్ టెస్ట్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందింది. ముఖ్యంగా నెక్సాన్ గత రెండేళ్లలోనే 3 లక్షలకు పైగా యూనిట్లు సేల్ చేసింది. 

పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ల శ్రేణిలో అందుబాటులోకి తీసుకువచ్చిన కార్లల్లో నెక్సాన్ ముందు వరుసలో ఉంటుంది. ఈ నేపథ్యంగా నెక్సాన్ కార్ల అమ్మకాల గురించి టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ  నెక్సాన్ 2017లో ప్రారంభించినప్పటి నుంచి డిజైన్, భద్రత, సౌకర్యం, డ్రైవింగ్ విషయాల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్లు ప్రత్యేకంగా కోరుకున్న కారుగా నెక్సాన్ నిలిచిందని వివరించారు. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో నెక్సాన్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని పేర్కొన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రత్యేక అప్‌డేటెడ్ వెర్షన్లతో నెక్సాన్ మోడల్‌ను ముందుకు తీసుకెళ్తామని వివరించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి