మినీ ట్రక్కుల విషయంలో మన దేశంలో టాటాతో పాటు మహీంద్రా కంపెనీలు టాప్ బ్రాండ్లుగా ఉన్నాయి. అయితే తక్కువ ధరతో పాటు అధిక పనితీరు విషయంలో టాటా ట్రక్కులకు మంచి పేరుంది. ఇప్పటికే ఇంట్రా వీ50, టాటా ఏస్ వాహనాలు మార్కెట్లో మంచి రిప్యూటేషన్ ను సాధించాయి. ఈ క్రమంలో మరో మూడు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్‌టీ ప్లస్ పేరిట వాటిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వాహనాలు అనువైన బడ్జెట్లోనే లభిస్తున్నాయి. ఎక్కువ దూరాలు అధిక పేలోడ్ లతో ప్రయాణించగలిగేలా వీటిని టాటా మోటార్స్ రూపొందించింది. అత్యాధునిక ఫీచర్లను సైతం ఇందులో సమకూర్చింది. ఇది పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ వాతావరణాకి కూడా సరిగ్గా సరిపోతాయని కంపెనీ ప్రకటించింది. ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ.. అధిక మైలేజీ ఇచ్చే విధంగా వీటిని రూపొందించనట్లు చెప్పింది. ఈ వాహనాలకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టాటా మోటార్స్ సీవీ డీలర్ షిప్ ల వద్ద వీటిని ఆర్డర్ చేయొచ్చు. ఈ నేపథ్యలో ఈ వాహనాలకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇంట్రా న్యూ-జెన్ పికప్ మెరుగైన డ్రైవబిలిటీని అందిస్తుంది. అత్యధిక పేలోడ్ సామర్థ్యం, పెద్ద లోడింగ్ ఏరియా, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, శక్తివంతమైన డ్రైవ్‌ట్రెయిన్‌తో పికప్ ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్వచిస్తుంది. ఇది విశ్వసనీయమైన 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్ సిస్టమ్, 9.7 అడుగుల పొడవైన లోడ్ బాడీతో వస్తుంది. దీని క్యాబిన్ కారు లాంటి సౌకర్యాన్ని, అలసట లేని డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
భారతదేశంలో మొట్టమొదటి డ్యూయల్ ఫ్యూయల్ మోడల్ ఇంజిన్ ఇందులో ఉంది. దీనిలో రెండు రకాల ఇంధనాలను వినియోగించుకొనేలా ఇంజిన్ ను అమర్చారు. సీఎన్జీతో పటు పెట్రోల్ తో కూడా ఇది నడుస్తుంది. సమర్థవంతమైన ఫ్లీట్ మేనేజ్‌మెంట్ కోసం ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్ సిస్టమ్‌తో వస్తుంది. 1,200కిలోల మెరుగైన పేలోడ్ సామర్థ్యం ఉంటుంది. గో-ఎనీవేర్ సామర్థ్యం కోసం మూడు సీఎన్జీ ట్యాంక్‌లతో, ఇది నిరంతరాయంగా కార్యకలాపాలు, అధిక లాభాలను అందించేలా రూపొందింది.
మన దేశంలో అత్యంత విజయవంతమైన వాణిజ్య వాహనం టాటా ఏస్. ఇప్పుడు దీనిని అపగ్రేడ్ చేసి ఏస్ హెచ్‌టీ+ పేరుతో లాంచ్ చేశారు. ఎక్కువ లోడ్ బాడీ, 900కిలోల పేలోడ్ సామర్థ్యంతో టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్, అధిక శక్తి, సామర్థ్యంతో వస్తుంది. తక్కువ నిర్వహణ ఖర్చులతో అధిక ఆదాయాలను అందిస్తాయి. ఇది రెండు రెట్లు ప్రయోజనాన్ని సూచిస్తుంది. టాటా ఏస్ మాదిరిగానే ఆపరేటింగ్ ఎకనామిక్స్ పవర్, పికప్, పనితీరు ఉంటాయి. అదనంగా, టాటా ఇంట్రా వీ50 ఇప్పుడు ఉద్గారాలపై కస్టమర్ స్నేహపూర్వక సాంకేతికతను అందిస్తుంది, వినియోగదారులకు తక్కువ ధరకు యాజమాన్యాన్ని అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..