TATA Vehicle Price Hike: టాటా మోటార్స్ తన కార్ల ధరలను మరోసారి పెంచింది. అన్ని ఉత్పత్తులపై దాదాపు 0.55 శాతం ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముడిసరుకు ధరలను పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించారు. భారతీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మన దేశంలో SUV కార్లు, సెడాన్ కార్లు, హ్యాచ్‌బ్యాక్ కార్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ముడిసరకు ధరలు, పన్నుల భారం నేపథ్యంలో ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు కంపెనీ వాణిజ్య వాహణాలపై ధరలను 1.5 శాతం నుండి 2.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది జూలై 1 నుండి అమలులోకి వచ్చింది. ఒక్కో మోడల్‌పై ఒక్కో రకంగా ధరలు పెంచారు.
జూన్ నెలలో అమ్మకాలు ఆశజనకంగానే జరిగాయని కంపెనీ వెల్లడించింది. అలాగే, టాటా మోటార్స్ EV సెగ్మెంటలో నవంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. కంపెనీకి చెందిన మూడు కార్లు రూ. 20 లక్షల లోపే ఉండటం విశేషం. ఆ తరువాత స్థానంలో ఎంజీ కారు ఉంది. ఇక గత నెలలో టాటా మోటార్స్ 45,197 యూనిట్లను విక్రయించగా.. గతేడాది ఇదే నెలలో పోలిస్తే 87 శాతం వృద్ధిని సాధించింది. గత నెలలో టాటా నెక్సాన్ కాంపాక్ట్ SUV విక్రయాల విషయంలో కాస్త వెనుకబడింది. అయినప్పటికీ కంపెనీ స్థిరమైన వృద్ధినే సాధించింది.
జీప్ ఇండియా కూడా ధరలను పెంచింది..
జీప్ ఇండియా కూడా జీప్ కంపాస్ ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈ కంపెనీ SUV కారు ధరలు గట్టిగానే పెరగనున్నాయి. తాజా ప్రకటన ప్రకారం.. జీప్ కంపాస్ ధర రూ. 35,000 పెంచనున్నారు. ఇది స్పోర్ట్స్ 2.0 డీజిల్ వెర్షన్ మినహా అన్ని వెర్షన్‌లకు వర్తిస్తుంది. అంతకుముందు ఏప్రిల్‌లో జీప్ ఇండియా కంపాస్ ఎస్‌యూవీ కారుపై రూ.25,000 పెంచింది.