Tata Neu: ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలోకి టాటా.. ఇక జొమాటో.. స్విగ్గీకు గట్టి పోటీ

ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు అధిక ప్రజాదరణ పొందుతున్నాయి. వీటిల్లో కూడా జొమాటో, స్విగ్గీ వంటి యాప్స్ నుంచి ఫుడ్ డెలివరీ పొందే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే తాజాగా ఈ ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలోకి టాటా కంపెనీ అడుగుపెట్టనుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. టాటా నియో, సాల్ట్-టు-సాఫ్ట్‌వేర్ రెండూ కలిసి టాటాకు సంబంధించిన సూపర్ యాప్, ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)లో పిగ్గీబ్యాక్ చేయడం ద్వారా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ స్పేస్‌లోకి ప్రవేశించడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొంటున్నాయి.

Tata Neu: ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలోకి టాటా.. ఇక జొమాటో.. స్విగ్గీకు గట్టి పోటీ
Tata Neu

Updated on: Feb 08, 2024 | 6:30 AM

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు అనేవి జీవితంలో భాగం అయ్యిపోయాయి. ప్రతి చిన్న అవసరానికి స్మార్ట్‌ఫోన్లను ఆశ్రయిస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌లో ఉండే వివిధ రకాల యాప్స్ ద్వారా మన అవసరాలను తీర్చుకోవడం కూడా తప్పనిసరైంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు అధిక ప్రజాదరణ పొందుతున్నాయి. వీటిల్లో కూడా జొమాటో, స్విగ్గీ వంటి యాప్స్ నుంచి ఫుడ్ డెలివరీ పొందే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే తాజాగా ఈ ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలోకి టాటా కంపెనీ అడుగుపెట్టనుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. టాటా నియో, సాల్ట్-టు-సాఫ్ట్‌వేర్ రెండూ కలిసి టాటాకు సంబంధించిన సూపర్ యాప్, ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)లో పిగ్గీబ్యాక్ చేయడం ద్వారా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ స్పేస్‌లోకి ప్రవేశించడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొంటున్నాయి. ఈ తాజా కలయికతో పాటు ఫుడ్ డెలివరీ రంగంలో టాటా రాక గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రాబోయే కొద్ది రోజుల్లో క్లోజ్డ్-యూజర్ గ్రూప్ ట్రయల్స్ కోసం ఓఎన్‌డీసీ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్ సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. టాటా ఫుడ్ ఆర్డరింగ్ రంగంలోకి ప్రవేశించడం వెనుక ఉన్న ఆలోచన వినియోగదారులను క్రమం తప్పకుండా యాప్‌లోకి తీసుకురావడానికి ‘హై-ఫ్రీక్వెన్సీ యూజ్ కేస్’ని అభివృద్ధి చేయడమేనని పేర్కొంది . ఇది టాటా నియోకు తన ఇతర ఉత్పత్తులను యాప్‌లో క్రాస్-సేల్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ముఖ్యంగా దుస్తులు, ఆభరణాలు, కిరాణా, ఎలక్ట్రానిక్స్, ఫ్లైట్‌లు మరిన్ని కేటగిరీల్లో సేల్స్ పెరిగే అవకాశం ఉంది. 

ప్రస్తుతం టాటా నియో యాప్‌లో ఆహారం కోసం ప్రత్యేక ఎంపిక ఉంది. అయితే ఇది తాజ్‌తో సహా టాటా గ్రూప్ రెస్టారెంట్‌ల నుంచి మెనులను కూడా చూపుతుంది. ఓఎన్‌డీసీ ఇంటిగ్రేషన్ తర్వాత ఈ యాప్ నగరాల్లోని పెద్ద సంఖ్యలో తినుబండారాల నుండి ఆహార ఎంపికలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో స్విగ్గీ, జొమాటో 95 శాతానికి పైగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..