Tata Cars: భారత్‌లో పలు ఆటోమోబైల్ కంపెనీలు కార్ల ధరలు పెంచనున్నట్లు ఇటీవల ప్రకటించాయి. అయితే టాటా మోటార్స్ కూడా తాజాగా ఆ జాబితాలో చేరిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు సార్లు కార్ల ధరలను పెంచిన టాటా మోటార్స్ తాజాగా మూడు సారి పెంచుతున్నట్లు ప్రకటించడం గనార్హం. ప్యాసింజర్ వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ధరలు ఎంత మేర పెంపు ఉంటుంది.. ధరలు పెరుగుదల ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్న విషయంల ఇంకా వెల్లడించలేదు.
అయితే ముడిపదార్థాల వ్యయం పెరిగినందునే కార్ల ధరలు పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. మరి కొన్ని రోజుల్లో మోడల్స్ వారీగా ధరల పెంపును కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది. స్టీల్ సహా పలు లోహాలతో పాటు ముడి పదార్థాల ధరలు వరుసగా పెరుగుతుండటంతో కార్ల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇప్పటికే పలు కంపెనీలు కూడా కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. హోండా కంపెనీ కూడా పెంచబోతోంది. కార్ల తయారీకి ఉపయోగించే స్టీల్, అల్యుమినియంతో పాటు విలువైన ఇతర లోహల ధరలను పెరగడంతో కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇలా ఒక్కొక్క కంపెనీ కార్ల ధరలను పెంచుతుండటంతో సామాన్య ప్రజలు కారు కొనుగోలు చేయాలంటే కాస్త భారంగా మారనుంది.