Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..!

|

Dec 25, 2021 | 1:18 PM

Sukanya Samriddhi Yojana: భారత ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ది యోజన పథకం. ఆడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కార్‌..

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..!
Sukanya Samriddhi Yojana
Follow us on

Sukanya Samriddhi Yojana: భారత ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ది యోజన పథకం. ఆడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కార్‌ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరమనే చెప్పాలి. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు, పోస్టాఫీసుల్లో ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల పేరుతో ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా డబ్బులు జమ చేస్తూ ఉండాలి. మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరితో కుమార్తెల విద్య, వివాహం వంటి ముఖ్యమైన పని కోసం ఉపయోగించవచ్చు. సుకన్య పథకం కింద ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇక జనవరి 1, 2022న సుకన్య స్కీమ్‌కి కొత్త వడ్డీ రేటును ప్రకటించవచ్చు.

వడ్డీ రేట్లు..
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6 శాతం ఉంది. ఈ నిర్ణయం ప్రభుత్వ సెక్యూరిటీలపై అందుబాటులో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా తీసుకోబడుతుంది. అంటే G-sec. ఈ పథకాన్ని 2014లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఖాతాను 10 సంవత్సరాల వయస్సు వరకు ఆడపిల్ల పేరు మీద తెరవవచ్చు. ఈ ఖాతా 21 సంవత్సరాల వయస్సులో మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలు.

సుకన్య ఖాతాకు ఎవరెవరు అర్హులు:
సుకన్య సమృద్ధి యోజన కింద, ఒక సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం కింద భారతదేశంలోని బాలికల పేరుతో ఒక పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చు. అయితే, కవలలు లేదా త్రిపాది పిల్లలు పుట్టినప్పుడు. సుకన్య సమృద్ది యోజన అకౌంట్‌లో అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు జమ చేస్తూనే ఉండాలి. 21 ఏళ్లు నిండిన తర్వాత డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

పథకం వివరాలు:
► ఈ పథకంలో డిపాజిట్లు ఖాతా తెరిచిన తేదీ నుండి గరిష్టంగా 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు చేయవచ్చు.

► ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం రూ. 250 జమ చేయకపోతే, ఆ ఖాతా డిఫాల్ట్‌గా పరిగణించబడుతుంది.

► ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తికాకముందే డిఫాల్ట్ ఖాతాను పునరుద్ధరించవచ్చు. దీని కోసం, ప్రతి డిఫాల్ట్ సంవత్సరానికి రూ. 50 డిఫాల్ట్‌ పెనాల్టీతో కనీసం రూ. 250 చెల్లించాలి.

► ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద డిపాజిట్ చేసిన మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు.

►ఈ పథకంలో వచ్చే వడ్డీకి కూడా ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

► పిల్లలకి 18 ఏళ్లు వచ్చే వరకు సంరక్షకుడు ఖాతాను నిర్వహిస్తాడు.

► ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి నుండి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఖాతాలో ఉపసంహరణ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? సమయానికి బిల్లు చెల్లించకుంటే క్రెడిట్‌ స్కోర్‌పై ఎఫెక్ట్‌..!

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? ఈ విధంగా తీసుకోవచ్చు..!