Business Ideas: మహిళలు ఇంట్లోనే కూర్చుండి డబ్బు సంపాదించే బిజినెస్ ఐడియా మీకోసం.. చేతినిండా డబ్బే డబ్బు..

| Edited By: Janardhan Veluru

Mar 04, 2023 | 4:01 PM

నేటికాలంలో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీకొంతమంది మహిళలు పెళ్లి తర్వాత పిల్లలు, ఇల్లు చూసుకునేందుకు సమయం సరిపోతుంది.

Business Ideas: మహిళలు ఇంట్లోనే కూర్చుండి డబ్బు సంపాదించే బిజినెస్ ఐడియా మీకోసం.. చేతినిండా డబ్బే డబ్బు..
Cash
Follow us on

నేటికాలంలో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీకొంతమంది మహిళలు పెళ్లి తర్వాత పిల్లలు, ఇల్లు చూసుకునేందుకు సమయం సరిపోతుంది. ఉద్యోగం చేయాలన్న కోరిక ఉన్నప్పటికీ పరిస్థితులు కారణంగా చేయలేకపోతున్నారు. అలాంటి మహిళలు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి పనులు, పిల్లలను చూసుకుంటూ ఖాళీ సమయంలోనూ డబ్బు సంపాదించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంటి పనులు, పిల్లలను చూసుకుంటూ సంపాదించే ప్రతి రూపాయి సంతృప్తిని ఇస్తుంది. మహిళలు మనసు పెట్టి ఇంట్లోనే లక్షలాది రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇంటి సంపాదన ఆధారపడకుండా…తామే సంపాదిస్తున్నామని గర్వంగా ఫీల్ కావొచ్చు.

ఈ కాలంలో లింగ వివక్ష చాలా వరకు తగ్గింది. ఇప్పుడు స్త్రీలు, పురుషులతోపాటు సమానంగా అడుగులు వేస్తున్నారు. ఒక మహిళ తలెత్తి గర్వంగా ఆర్థికంగా బలంగా ఉండే స్థితికి చేరుకుంది. ప్రతిరంగంలోనూ స్త్రీ దూసుకుపోతోంది. ఇంటి బాధ్యతలన్నీ భార్యభర్తలు సమానంగా పంచుకునే రోజులు వచ్చాయి. సరైన మార్గనిర్దేశం, అవకాశం ఇస్తే స్త్రీకి ఏదీ కష్టం కాదు. ఇల్లు పిల్లలు, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం, చదువు, కళ, దేశ సేవ, సామాజిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన ముదర వేయగలదు. చాలామంది మహిళలకు ఇంట్లో పనిచేయాలనే కోరిక ఉంటుంది. కానీ ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు మహిళలు ఇంట్లోనే కూర్చుండి చేసే వ్యాపారం గురించి తెలుసుకుందాం.

మంచి వ్యాపారాన్ని ఎలా ఎంచుకోవాలి? :

ఎలాంటి వ్యాపారం ఎంచుకోవాలో తెలియక చాలామంది స్త్రీలు గందరగోళపడుతుంటారు. మనసు ఉంటేనే మార్గం ఉంటుంది. మనకు అత్యంత ఆసక్తి ఉన్న రంగంలో పనిచేస్తే విజయం వరిస్తుంది. ముందుగా మీరు ఏ రంగాల్లో రాణిస్తారో తెలుసుకోవాలి. తక్కువ పెట్టుబడిలో ఏ వ్యాపారం చేస్తే లాభదాయంగా ఉంటుందో తెలుసుకోవాలి. తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలి.

ఇవి కూడా చదవండి

కుట్టుమిషన్ :

కుట్టుమిషన్ అనేది ఒక కళ. ఈ వ్యాపారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కుట్టుపనిలో అనేక రకాలు ఉన్నాయి. కేవలం కుట్టుపని కాదు . కట్టింగ్, స్టిచింగ్, హ్యాండ్ కుట్టు, రిపేర్, ఎంబ్రాయిడరీ, ఫాల్, చిరిగిన బట్టల మరమ్మత్తు మొదలైనవి ఉన్నాయి.

కోచింగ్:

ఇది ఎప్పటికీ డిమాండ్ ఉన్న ఉద్యోగం. విద్యావేత్తలు పిల్లలకు కోచింగ్ ఇవ్వవచ్చు. ఇటీవలి కాలంలో కోచింగ్‌ పొందే వారి సంఖ్య చాలా పెరిగింది. పిల్లలకు ఇంట్లోనే నేర్పించవచ్చు. పాఠశాల విద్య మాత్రమే కాదు. మీరు సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహించవచ్చు. అంతేకాదు ఇంట్లోనే డ్యాన్స్, పెయింటింగ్, మెహందీ, క్రాఫ్ట్ మొదలైనవి చేయడం సులభంగా ఉంటుంది.

కృత్రిమ ఆభరణాలు:

ఎక్కువ మంది మహిళలు బంగారు ఆభరణాల కంటే కృత్రిమ ఆభరణాలను చాలా ఇష్టపడతారు. మీరు కృత్రిమ నగలను తయారు చేసి కూడా అమ్మవచ్చు. లేదా ఆసక్తి ఉన్నవారికి కృత్రిమ ఆభరణాల తయారీ గురించి ట్రైనింగ్ ఇవ్వవచ్చు. అందమైన చిన్న బొమ్మలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మీరు మీ ఖాళీ సమయంలో వీటిని తయారు చేసి విక్రయించుకోవచ్చు.

రీ-సెల్లింగ్:

ఇది చాలా సులభమైన పని. మీరు ఆన్‌లైన్‌లో వస్తువులను విక్రయించాలి. మీరు ఒక కంపెనీతో చేతులు కలపాలి. ఆ కంపెనీ ఉత్పత్తులను ప్రచారం చేస్తూ విక్రయించాలి. దీనికి కావాల్సిన పెట్టుబడి అంతా కూడా కంపెనీ చెల్లిస్తుంది. తయారీ, ప్యాకింగ్, డెలివరీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎంత ఎక్కువ అమ్మితే అంత లాభం పొందవచ్చు. ఇవే కాదు అనేక ఇతర వ్యాపారాలు ఇంట్లో మహిళలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ కథనాలు చదవండి..