Success Story: లక్షల జీతం ఇంజనీరింగ్‌ను వదిలి తన గ్రామానికి వచ్చాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు..!

Engineer: ఇంజనీర్లకు ఉండే జీతం అంతా ఇంతా కాదు. లక్షల రూపాయల జీతం ఉంటుంది. కానీ అలాంటి జీతం ఉన్న ఇంజనీర్‌ ఉన్నట్టుండి ఉన్న ఉద్యోగాన్ని వదిలీ సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఆయన చేసిన పనికి అందరు షాకవుతారు. ఉప్పుడు ఉద్యోగంలో వచ్చే జీతం కన్న రెట్టింపు ఆదాయం పొందుతున్నాడు..

Success Story: లక్షల జీతం ఇంజనీరింగ్‌ను వదిలి తన గ్రామానికి వచ్చాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు..!
Success Story

Updated on: Apr 28, 2026 | 9:42 AM

Success Story: నేటి కాలంలో చదువు పూర్తికాగానే పట్టణాల్లో పెద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా చాలా మంది పెట్టుకుంటారు. కానీ, బీహార్‌కు చెందిన సంతోష్ కుమార్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. చేతిలో ఇంజనీరింగ్ డిగ్రీ, చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలేసి తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి, పాడి పరిశ్రమలో అద్భుతాలు సృష్టిస్తున్నారు.

ఇంజనీరింగ్ నుంచి డెయిరీ ఫార్మింగ్ వరకు:

పాట్నా జిల్లా ధనేరువా బ్లాక్‌లోని బీర్ గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ బీటెక్ పూర్తి చేశారు. గుజరాత్‌లోని ఏబీజీ షిప్‌యార్డ్‌లో మంచి పొజిషన్‌లో ఉద్యోగం కూడా సంపాదించారు. అయితే ఆ ఉద్యోగం ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో పట్నాకు తిరిగి వచ్చి, కేవలం 7 సాహివాల్ ఆవులతో డెయిరీ వ్యాపారాన్ని ప్రారంభించారు. నేడు ఆయన వద్ద 125కు పైగా ఆవులు ఉన్నాయి.

నెలకు రూ. 10 లక్షల ఆదాయం:

సంతోష్ తన కంపెనీ ద్వారా పాట్నా నగరంలోని సుమారు 250 నుండి 300 కుటుంబాలకు నాణ్యమైన A2 పాలను హోమ్ డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నెలకు రూ.10 లక్షల వరకు టర్నోవర్ సాధిస్తున్నారు. భవిష్యత్తులో రోజుకు 15,000 లీటర్ల A2 పాలను విక్రయించడమే తన లక్ష్యమని ఆయన గర్వంగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆవుల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ:

ఆవులు ఆరోగ్యంగా ఉంటేనే పాలు నాణ్యంగా ఉంటాయని సంతోష్ నమ్ముతారు. అందుకే వాటి కోసం:

సొంత పొలంలోనే పచ్చగడ్డి పండిస్తారు. ఆవుల దాణాలో ఆవ పిండి, సోయాబీన్, మొక్కజొన్న, గోధుమలు, మినరల్ మిక్స్‌చర్ వంటి 17 రకాల పోషక పదార్థాలను కలిపి ఇస్తారు. దీనివల్ల పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, పాలు చిక్కగా, నాణ్యంగా ఉంటున్నాయి.

Success Story

గ్రామస్తులకు ఉపాధి – ఇతరులకు మార్గదర్శి:

సంతోష్ కేవలం తాను ఎదగడమే కాకుండా, తన గ్రామంలోని మరో 10 మంది రైతులకు బ్యాంక్ లోన్లు ఇప్పించి పాడి పరిశ్రమ వైపు మళ్లించారు. ఇప్పుడు ఆ రైతులందరూ సంతోష్ ఫామ్‌తో కలిసి పనిచేస్తున్నారు. “గ్రామాల్లో భూమికి కొరత లేదు. సరైన ప్రణాళిక ఉంటే ఇక్కడే ఉండి లక్షలు సంపాదించవచ్చు” అని ఆయన యువతకు పిలుపునిస్తున్నారు.  కష్టపడే తత్వం, వినూత్న ఆలోచన ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని సంతోష్ కుమార్ నిరూపించారు. ఆయన ప్రయాణం నేటి విద్యావంతులైన యువతకు ఒక గొప్ప స్ఫూర్తి.

ఇది కూడా చదవండి: Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us