
Electric Two Wheelers: ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ సబ్సిడీని రూ20,000 నుండి రూ.30,000 కు పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఒడిశా ప్రభుత్వం తన కొత్త డ్రాఫ్ట్ EV పాలసీ 2025 లో ఈ నిబంధనను చేర్చింది. ఇది పరిశ్రమ వ్యక్తుల నుండి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు అమలు చేయనుంది.
ఇది కూడా చదవండి: UPI Rule Change: యూపీఐ లావాదేవీల్లో నేటి నుండి పెద్ద మార్పు.. రూ.10 లక్షల వరకు లావాదేవీలు!
డ్రాఫ్ట్ EV పాలసీ 2025 ప్రకారం.. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌పై ప్రతి kWh బ్యాటరీ సామర్థ్యానికి రూ.5,000 ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ సబ్సిడీ గరిష్ట పరిమితి రూ.30,000. గతంలో ఈ గరిష్ట సబ్సిడీ రూ.20,000. ఈ పెరుగుదల రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది.
మీడియా నివేదికల ప్రకారం.. ఇప్పుడు అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, ద్విచక్ర వాహనాలు మార్కెట్లోకి వచ్చాయని, అందువల్ల ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని తదనుగుణంగా పెంచాలని నిర్ణయించిందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. ద్విచక్ర వాహనాలతో పాటు ఒడిశా ప్రభుత్వం బ్యాటరీతో నడిచే మూడు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, టాక్సీలు, ట్రక్కులు, బస్సులకు కూడా సబ్సిడీని అందిస్తుంది. 2030 వరకు అమలులో ఉండే ప్రతిపాదిత EV పాలసీ 2025 ప్రకారం.. ఒడిశా ప్రభుత్వం నాలుగు చక్రాల తేలికపాటి మోటారు వాహనాలు (రవాణా) లేదా టాక్సీలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.1.50 లక్షల నుండి రూ.2 లక్షలకు పెంచుతుందని అధికారి తెలిపారు. విద్యుత్ బస్సుల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం రూ. 20 లక్షల ప్రోత్సాహకాన్ని కూడా ఇస్తుందని ఆయన చెప్పారు.
ఒడిశా ప్రజలు మాత్రమే ప్రయోజనం:
పాలసీ డాక్యుమెంట్ ప్రకారం.. ఒడిశాలో శాశ్వత నివాసితులుగా ఉన్నవారికి ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ప్రతి లబ్ధిదారుడు ప్రతి ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని ఒక్కసారి మాత్రమే కొనుగోలు చేసినందుకు ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. ఈ విభాగంలో పరిశోధన, అభివృద్ధి (R&D) కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ముసాయిదా EV విధానం రూ.15 కోట్ల ప్రత్యేక నిధిని కూడా ప్రతిపాదిస్తుంది.
విద్యుత్ వాహనాల సంఖ్యను పెంచడమే లక్ష్యం:
సెప్టెంబర్ 2021లో అమల్లోకి వచ్చిన ఒడిశా ఎలక్ట్రిక్ పాలసీ 2021 రాబోయే నాలుగు సంవత్సరాలలో 20% కొత్త రిజిస్ట్రేషన్లకు ఎలక్ట్రిక్ వాహనాలు దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఈ కాలంలో ఆ శాతం కేవలం 9% మాత్రమే. అందువల్ల ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 2030 నాటికి 50% ఎలక్ట్రిక్ వాహనాలను కొత్త రిజిస్ట్రేషన్లలో కలిగి ఉండాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: ITR Deadline Extension: ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించారా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి