ఫారం 15జీ లేదా ఫారం 15హెచ్ సమర్పించాలనుకొనే వినియోగదారులకు కెనరా బ్యాంకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో సులభంగా ఫారం 15జీ, ఫారం 15 హెచ్ లను సమర్పించేందుకు వెసులుబాటు కల్పించింది. .అంతేకాక 75 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మూడు సార్లు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ఉచితంగా చేసుకోవచ్చు. ఎటువంటి చార్జీలు కూడా ఉండవని స్పష్టం చేసింది. ఈ ప్రత్యేకమై పథకం మే 24 వరకూ అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను కెనరా బ్యాంకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ విధంలో మాత్రమే కాక కెనరా బ్యాంకు వినియోగదారులు ఫారం 15జీ, 15హెచ్ లను ఎస్ఎంఎస్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సమర్పించవచ్చు.
Now easily submit your 15G/15H forms through Canara Bank’s Doorstep Banking.#CanaraBank #DoorstepBanking #SeniorCitizens pic.twitter.com/E3eNkuMVNH
ఇవి కూడా చదవండి— Canara Bank (@canarabank) April 25, 2023
అలాగే మీరు కెనారా బ్యాంక్ లోకి లాగిన్ అయ్యి కూడా ఫారం 15జీ, 15 హెచ్ లను సబ్ మిట్ చేయొచ్చు.
అలాగే ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ ఫారాన్నిసబ్ మిట్ చేయొచ్చు. అదెలా అంటే 15G అని టైప్ చేసి ఆదాయాన్ని ఎంటర్ చేసి 7036000157 కి మెసేజ్ చేయాలి.
కెనరా బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ వెసిలిటీని అందిస్తోంది. అందుకోసం 100 సెంటర్లను లాంచ్ చేసింది. ఆ సెంటర్ల లిస్ట్ కావాలంటే బ్యాంకు వెబ్ సైట్ ని సందర్శిస్తే సరిపోతుంది. దీని కోసం సర్వీస్ చార్జ్ రూ. 75, జీఎస్టీ రూ. 13.5 కలిపి మొత్తం రూ. 88.50 చార్జ్ చేస్తారు.
మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ టీడీఎస్ పేరిట కోత విధిస్తోందా? అయితే మీరు ఆ కోత నుంచి మినహాయింపు పొందవచ్చు. అందుకోసం ఫారం 15జీ లేదా ఫారం 15హెచ్‌లను సమర్పించడం మంచిది. మీ బ్యాంక్ ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఆదాయంపై పన్ను పడకుండా ఉండేందుకు ఈ ఫారాలు మీకు తోడ్పడతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..