Inspector Raj: అనేక వ్యాపారాలకు భారతదేశం కేంద్రంగా ఉంది. దేశంలో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న అనేక మంది ఔత్సాహిత పారిశ్రామికవేత్తలు(Entrepreneurs) ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు తమ వ్యాపారాలను విస్తరించారు. వాటి నుంచి లాభాలు సైతం(Profits) ఆర్జించారు. ఇక్కడ అందరూ ప్రస్తావించడం మరచిపోతున్న విషయం ఏంటంటే.. ఆ వ్యాపారాలను నిర్వహించడంలో ఎదురవుతున్న ఆటంకాలు. వివిధ చట్టాలు, నిబంధనల రూపంలో వ్యాపారాలకు ఎదురవుతున్న ఆటంకాలను వ్యాపారవేత్తలు పాటించాల్సి వస్తోంది. వీటిని పాటించటంలో అలసత్వం వహిస్తే సదరు వ్యాపారవేత్తలను జైలుకు పంపిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వ్యాపారాల విషయంలో ఎదురవుతున్న ఈ కఠిన చట్టాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇద్దరు ప్రముఖ విధాన విశ్లేషకులు, గౌతమ్ చికర్‌మనే మరియు రిషి అగర్వాల్‌ల నివేదిక ‘వ్యాపారం చేయడం కోసం జైలు శిక్ష: భారతదేశ వ్యాపార చట్టాలలో 26,134 క్రిమినల్ నిబంధనలు’ అనే శీర్షిక ఈ సమస్యపైనే ఉంది.
భారతీయ వ్యాపారాలు స్పష్టంగా అభివృద్ధి చెందాయి.. అది ప్రభుత్వాల చొరవ వల్ల కాదు, ప్రభుత్వం ఉన్నప్పటికీ అన్న విషయాన్ని అందరూ గమనించాల్సిన విషయం. ఉదాహరణకు ఐటీ కంపెనీలకు పేరుగాంచిన కర్ణాటకలో అనేక క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో పంజాబ్ నిలిచింది. విదేశీ పెట్టుబడుల్లో అగ్రగామిగా నిలిచిన 5 రాష్ట్రాల్లో సైతం వ్యాపార అనుకూల వాతావరణం లేదని చెప్పుకోక తప్పదు. కానీ కొన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సదరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అందిస్తున్న భూమి, రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సౌకర్యాలు, వ్యాపార అభివృద్ధికి అవసరమైన మానవవనరుల లభ్యత వల్ల అనేక మంది ఆయా రాష్ట్రాలను ఎంచుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.
1991 లోనే భారత్ ఎకనమిక లిబరలైజేషన్ బాట పట్టినప్పటికీ దానిని లైసెన్స్ రాజ్ వ్యవస్ధ చాలా వరకు అడ్డంకిగా నిలిచింది. స్వతంత్య్రం తరువాత సైతం చాలా కాలం లైసెన్స్ రాజ్ వ్యవస్థ దేశంలో కొనసాగింది. ఆ వ్యవస్థలో క్లిష్టమైన ప్రక్రియ, అధికారుల నుంచి ఎదురయ్యే తలనొప్పితో అనేక మంది వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థ ఎక్కువ శాతం అవినీతి పెరగడానికి కారణంగా నిలిచింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సులభతరమైన డిజిటల్ ప్రాసెంసింగి విధానం వల్ల వ్యాపారుల్లో, పెట్టుబడి దారుల్లో సానుకూల ధృక్పదం ఏర్పడుతుందని.. అది వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని అభిప్రాయ పడుతున్నారు.
గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వ్యాపారాలకు అనుమతి ఇవ్వడంతో ఉన్న గజిబిజి నియమాలు, నిబంధనలను తొలగించడం వల్ల పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించిన సమస్యను తగ్గించనదని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి..
Air India: బంగారం ధరించే విషయంలో ఎయిర్ ఇండియా న్యూ రూల్స్.. ఇప్పుడు తప్పక తెలుసుకోండి..
China Apps Ban: కొత్తగా ఆ 54 చైనా యాప్ లు బ్యాన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..