Stock Market: వారంలో రూ.8 లక్షల కోట్లు ఆర్జించిన పెట్టుబడిదారులు.. మార్చిలో 4 శాతం పెరిగిన ప్రధాన ఇండెక్స్‌లు..

|

Apr 02, 2022 | 5:45 PM

గత వారం నష్టాలను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారం భారీ లాభాలను ఆర్జించాయి...

Stock Market: వారంలో రూ.8 లక్షల కోట్లు ఆర్జించిన పెట్టుబడిదారులు.. మార్చిలో 4 శాతం పెరిగిన ప్రధాన ఇండెక్స్‌లు..
Stock Market
Follow us on

గత వారం నష్టాలను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారం భారీ లాభాలను ఆర్జించాయి. ముడి చమురు(Crude Oil) ధరలు మెత్తబడటం, రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు పెట్టుబడిదారులలో సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. ఏప్రిల్ 1తో ముగిసిన వారంలో ప్రధాన సూచీలు సెన్సెక్స్(Sensex), నిఫ్టీ(NIfty) 3 శాతం లాభంతో ముగిశాయి. ఇదే సమయంలో మార్కెట్‌లో ఇన్వెస్టర్ల మొత్తం ఆస్తులు రూ.8 లక్షల కోట్లు పెరిగాయి. మార్చిలో ప్రధాన ఇండెక్స్‌లు 4 శాతం పెరిగాయి. ఆర్థిక సంవత్సరం కూడా ఈ వారంతో ముగిసింది. గత ఆర్థిక సంవత్సరం ఇన్వెస్టర్లకు లాభసాటిగా మారింది. సెన్సెక్స్, నిఫ్టీ ఈ సంవత్సరం 18 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి.

ఈ వారం మార్కెట్‌లో ఇన్వెస్టర్ల మొత్తం సంపద రూ.8 లక్షల కోట్లు పెరిగింది. ఈ శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత, బీఎస్‌ఈలో లిస్టయిన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.267.88 లక్షల కోట్ల స్థాయికి ఎగబాకింది. వారం క్రితం ఇది రూ.259.84 లక్షల కోట్లుగా ఉంది. అంటే బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ వారంలో రూ.8.04 లక్షల కోట్లు పెరిగింది. ఇదే సమయంలో ఈ వారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.59.75 లక్షల కోట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 9,059 పాయింట్లు లేదా 18.3 శాతం, నిఫ్టీ 2,774 పాయింట్లు లేదా 19 శాతం లాభపడ్డాయి.

Read Also.. Crude Oil: ముడి చమురు సరఫరా పెంచుతామన్న IEA.. పెట్రోల్, డీజిల్‌ రేట్లు తగ్గుతాయా..?