Stock Market Today: అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూలత.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

|

Oct 05, 2021 | 10:03 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోయింది.

Stock Market Today: అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూలత.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
stock market
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కాస్త నష్టాలను భర్తీ చేసుకుంది సెన్సెక్స్. కొద్ది సేపటి క్రితం సెన్సెక్స్ 65 పాయింట్ల నష్టంతో 59,234 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ కూడా స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 17,681 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. సిప్లా, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, టాటా స్టీల, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నాలుగు రోజుల వరుస నష్టాల తర్వాత సోమవారం సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఇవాళ మళ్లీ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మన దేశీయ స్టాక్ మార్కెట్‌పై కూడా ప్రభావాన్ని చూపుతున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెప్టెంబర్ మాసంలో బీఎస్ఈ సెన్సెక్స్ 60వేల పాయింట్ల మైలురాయిని అధిగమించడం తెలిసిందే. 60,412 పాయింట్ల ఆల్ టైమ్ హై స్థాయిని నమోదుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో గత కొన్ని రోజుల్లో ఆల్ టైమ్ స్థాయితో పోలిస్తే దాదాపు 700 పాయింట్ల మేర నష్టపోయింది.

Also Read..

Zodiac Signs: ఇతరులతో ఇట్టే కలిసిపోతారు.. ఈ నాలుగు రాశుల వారి ప్రత్యేకతే వేరు..

Aryan Khan drug case: ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ..