SBI Utsav Fixed Deposit Scheme: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అని పేరు పెట్టారు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ తక్కువ వ్యవధిలో ఉంచిన్నట్లు, దానిపై డిపాజిటర్లు అధిక రాబడిని పొందుతారని పేర్కొంది.
SBI ఈ డిపాజిట్ పథకం గురించి ట్వీట్ చేయడం ద్వారా ప్రజలకు సమాచారం ఇచ్చింది. ఇందులో ఎస్‌బీఐ ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్‌తో ముందుకు వచ్చింది. ఇందులో పెట్టుబడికి ఎక్కువ వడ్డీ లభిస్తుందని పేర్కొంది. SBI ఉత్సవ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడిదారులు 1000 రోజుల FDపై 6.10 శాతం వడ్డీని పొందుతారు. మరోవైపు సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
Let your finances do the hard work for you.
Introducing ‘Utsav’ Deposit with higher interest rates on your Fixed Deposits!#SBI #UtsavDeposit #FixedDeposits #AmritMahotsav pic.twitter.com/seMdVaOz0e— State Bank of India (@TheOfficialSBI) August 14, 2022
SBI ఉత్సవ్ డిపాజిట్ పథకం ఆగస్టు 15, 2022 నుంచి తదుపరి 75 రోజుల పాటు తెరచి ఉంటుంది. ఇటీవల, SBI రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లు ఉన్న FDలపై వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించింది. ఇది ఆగస్టు 13, 2022 నుంచి అమలులోకి వచ్చింది. SBI అన్ని టేనార్ FDలపై వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించింది. SBI 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన FDలపై వడ్డీ రేటును 5.30 శాతం నుంచి 5.45 శాతానికి పెంచింది. ఎస్‌బీఐ 5 నుంచి 10 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 5.50 శాతం నుంచి 5.65 శాతానికి పెంచింది.