SBI Car Loan: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్‌.. 90 శాతం రుణం..!

SBI Car Loan: ప్రస్తుతం కొత్త కారు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సులభమైన ప్రయాణాన్ని అనుభవించేందుకు..

SBI Car Loan: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్‌.. 90 శాతం రుణం..!

Updated on: Jan 19, 2022 | 9:17 AM

SBI Car Loan: ప్రస్తుతం కొత్త కారు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సులభమైన ప్రయాణాన్ని అనుభవించేందుకు ఎంతో మంది కారు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇక కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వివిధ బ్యాంకులు కూడా సులభంగా రుణాలను అందిస్తున్నాయ. ఇక తాజాగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కూడా తన కస్టమర్ల కోసం సులభమైన రుణాలను అందిస్తోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సమయంలో బ్యాంకులకు వెళ్లి రుణాల కోసం వెళ్లకుండా ఇంటి నుంచి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. కొత్త కారు కోసం రుణం పొందాలనుకునేవారికి మంచి ఆఫర్‌ అందిస్తోంది. ఇంటి వద్దనే ఉండి ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రుణాన్ని పొందవచ్చు. తక్కువ వడ్డీకే రుణం అందిస్తోంది. ఎస్‌బీఐ నుంచి కారు కోసం తక్కువ వడ్డీకే రుణం పొందాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ట్వీట్‌ చేసింది.

కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారిరు ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా గారీ, ఎస్‌బీఐ అధికారిక వెబ్‌ సైట్‌ నుంచి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కారు కొనుగోలుపై 90 శాతం వరకు రుణాన్ని అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. 7.25శాతం వడ్డీ రేటుతో రుణం అందిస్తోంది. రుణం పొందాలంటే ఇతర ఛార్జీలేమి ఉండవు.

 

ఇవి కూడా చదవండి:

SBI Scheme: కోవిడ్‌ సోకిన వారి కోసం ఎస్‌బీఐ ఈ ప్రత్యేక స్కీమ్‌ 3 నెలల ముందే నిలిపివేత.. ఇక రూ.20,000 పొందలేరు

Budget 2022: ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బంగారం ప్రియులకు శుభవార్తే.. అదేంటంటే..!