Business Idea: లక్షల ఆదాయం ఇచ్చే టెర్రస్ గార్డెనింగ్ బిజినెస్! పెట్టుబడి అవసరం లేకుండానే..
పట్టణాల్లో స్థలం కొరత నేపథ్యంలో రూఫ్ గార్డెనింగ్ వ్యాపారం అద్భుత అవకాశంగా మారింది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, 20-30 శాతం లాభాలు ఆర్జించవచ్చు. మొక్కల ఎంపిక, నీటి పారుదల వ్యవస్థలపై అవగాహనతో కిచెన్/ఆర్గానిక్ గార్డెన్స్ డిజైన్ చేయొచ్చు. ఇది పర్యావరణ హితమైన, లాభదాయకమైన వ్యాపారం.

పట్టణాల్లో స్థలం కొరత పెరుగుతున్న నేపథ్యంలో రూఫ్ గార్డెనింగ్ (టెర్రస్ గార్డెనింగ్) ఒక మంచి వ్యాపార అవకాశంగా మారుతోంది. పర్యావరణ హిత జీవనశైలి వైపు ప్రజలు మళ్లడంతో, ఇంటి పైకప్పులపై తోటలు ఏర్పాటు చేయించుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రూఫ్ గార్డెనింగ్ బిజినెస్‌ను ప్రారంభించాలని భావిస్తున్న వారికి ఇది సరైన సమయంగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మొదటగా మొక్కల ఎంపిక, మట్టిమిశ్రమాలు, నీటి పారుదల వ్యవస్థలు వంటి అంశాలపై అవగాహన అవసరం. కస్టమర్ల అవసరాలను బట్టి కిచెన్ గార్డెన్, అలంకార తోటలు, ఆర్గానిక్ కూరగాయల తోటలు వంటి ప్రాజెక్టులను రూపొందించవచ్చు.
ప్రారంభంలో చిన్న ప్రాజెక్టులతో మొదలుపెట్టి, అనుభవం పెరిగిన కొద్దీ పెద్ద ప్రాజెక్టులను చేపట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రూఫ్ గార్డెనింగ్ బిజినెస్‌లో ప్రధానంగా డిజైన్, అమలు, నిర్వహణ సేవల ద్వారా ఆదాయం పొందవచ్చు. ఒక సాధారణ టెర్రస్ గార్డెన్ ఏర్పాటు ఖర్చు రూ.20,000 నుంచి రూ.2 లక్షల వరకు ఉండవచ్చు. ప్రాజెక్టు పరిమాణం, మొక్కల రకం, నీటి వ్యవస్థ ఆధారంగా ధర మారుతుంది. అదనంగా నెలవారీ నిర్వహణ సేవల ద్వారా స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది.
ఇక ఈ వ్యాపారంలో లాభాలు కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంది. సరైన ప్లానింగ్‌తో 20-30 శాతం వరకు లాభ మార్జిన్ సాధించవచ్చని అంచనా. సోషల్ మీడియా, స్థానిక ప్రచారం ద్వారా కస్టమర్లను ఆకర్షించడం కీలకం. అలాగే, ఆర్గానిక్ ఉత్పత్తులపై పెరుగుతున్న డిమాండ్ ఈ రంగానికి మరింత ఊతమిస్తోంది. పైగా దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. సోషల్ మీడియాలో తక్కువ మొత్తంతో ప్రచారం చేసి, ఆర్డర్ వచ్చిన తర్వాత కస్టమర్ ఇచ్చే అడ్వాన్స్‌తో పని మొదలు పెట్టి, ఆ తర్వాత వారి నుంచే మరింత డబ్బు తీసుకొని పని పూర్తి చేయవచ్చు. సిబ్బందికి, మొక్కల రవాణాకు చిల్లర ఖర్చులు మాత్రమే అవసరం అవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
