BOBCARD offers: ఖర్చు కొంచెం.. సంబరాలు ఘనం.. వాలెంటైన్స్ డే వేడుకలకు అదిరే ఆఫర్లు..
ప్రేమికుల దినోత్సవాన్ని కొత్తగా, ప్రత్యేకంగా, వినూత్నంగా జరుపుకోవడానికి ప్రేమికులు ఎంతో ప్రాధాన్యమిస్తారు. సంబరాలు విభిన్నంగా ఉండాలని ప్రణాళికలు వేసుకుంటారు. రొమాంటిక్ డిన్నర్ అయినా, విహార యాత్ర అయినా, షాపింగ్ చేసినా.. వాలెంటెన్స్ డేని చిరస్థాయిగా మదిలో నిలుపుకోవాలని కోరుకుంటారు. అయితే ఇవన్ని ఖర్చుతో కూడుకున్నవే. అయితే బ్యాంకు ఆఫ్ బరోడా కస్టమర్లను ఆక్టుకునేందుకు ప్రత్యేకంగా వ్యాలెంటైన్స్ డే ఆఫర్లను ప్రకటించింది.

ప్రముఖ బ్యాంకు అయిన బ్యాంకు ఆఫ్ బరోడా వ్యాలెంటైన్స్ డేకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా తన కార్డులపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. బ్యాంకు ఆఫ్ బరోడాకు సంబంధించింన బీఓబీ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్వీనాయి. టిని ఉపయోగించడం ద్వారా వాలెంటైన్స్ డేని ఉత్సాహంగా జరుపుకోవడంతో పాటు డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన్ బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన బీఓబీ కార్డు అనేక ఆఫర్లను తీసుకువచ్చింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వివిధ వస్తువుల కోనుగోలు, సేవల వినియోగంపై తగ్గింపులు అందజేసింది. అమెజాన్, మైంట్రా, ఫ్లిప్ కార్ట్, గోయిబిబో, జోమాటో, పీవీఆర్ ఐమాక్స్ ఇలా.. అనేక వాటిపై డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ప్రేమికులందరూ ఉత్సాహంగా తక్కువ ఖర్చుతో సంబరాలు చేసుకోవచ్చు.
బ్లింకిట్
బ్లింకిట్ లో వెయ్యి రూపాయల కంటే ఎక్కువ చేసిన ఆర్డర్లపై పది శాతం తగ్గింపు పొందవచ్చు. కార్డుకు గరిష్టంగా రూ.300 అందిస్తారు. బీవోబీసీసీ300 అనే కోడ్ ను ఉపయోగించి ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు. ఫిబ్రవరి 8న ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ నెల 28 వరకూ ప్రతి శని, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది.
ఫ్లిప్ కార్ట్
ఐఫోన్ 13, 15, 16 సిరీస్ లపై బీఓబీ కార్డు ద్వారా రూ.5 వేల వరకూ తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్లను డబ్బులను ఒకేసారి చెల్లించి, లేదా ఈఎంఐల రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 11 నుంచి 15 వరకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
అమెజాన్
బీఓబీ కార్ట్ ను ఉపయోగించి అమెజాన్ లో కూడా షాపింగ్ చేయవచ్చు. ఈఎంఐ ద్వారా కొనుగోళ్లపై 7.5 శాతం తక్షణ తగ్గింపుతో పాటు మరో 500 తగ్గింపు లభిస్తుంది. నిబంధనల ప్రకారం వివిధ వస్తువులపై ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి ఒకటి నుంచి 23 వరకూ చెల్లుబాటు అవుతుంది. అలాగే అమెజాన్ లో 2 వీలర్ ఈఎంఐపై రూ.5000 వరకూ తగ్గింపు లభిస్తుంది. కార్డుకు గరిష్టంగా రూ.5 వేలు అందిస్తారు. ఫిబ్రవరి 28 వరకూ వర్తిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ గ్రోసరీ
ఫ్లిప్ కార్ట్ లో రూ.1500 కంటే ఎక్కువగా చేసిన ఆర్డర్లపై రూ.150 తగ్గింపు అందజేస్తున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 14 వరకూ తప్ప మిగిలిన శుక్రవారాల్లో లభిస్తుంది. 28వ తేదీ వరకూ నిబంధనల మేర వర్తిస్తుంది.
సూరత్ డైమండ్
సూరత్ డైమండ్ పై సుమారు రూ.5 వేల తగ్గింపు పొందవచ్చు. బీబీసీఆర్ఎస్2552517385 కోడ్ ను ఉపయోగించిన వారికి ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 28 వరకూ చెల్లుబాటులో ఉంటుంది.
పోస్ట్ కార్డ్ రిసార్ట్స్
బీఓబీవీఐపీ కోడ్ ను ఉపయోగించి రూమ్ బుక్కింగ్ పై ఫ్లాట్ రూ.3 వేల తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకూ చెల్లుబాటులో ఉంటుంది.
గోఐబీబో
విమానాలు, హోటల్ బుక్కింపై 15 శాతం వరకూ తగ్గింపును ప్రకటించారు. జీవోబీవోబీఈఎస్ టీ అనే కోడ్ ను ఉపయోగించి దేశీయ విమానాలు, హోటళ్లపై, అలాగే జీవోబీవోఐఎన్ టీఎఫ్ఈఎస్ టీ అనే కోడ్ ద్వారా అంతర్జాతీయ విమానాలు, హోటళ్ల లో తగ్గింపులు లభిస్తాయి. ఇవి ఫిబ్రవరి 14 వరకూ చెల్లుబాటులో ఉంటాయి.
పీవీఆర్ ఐఎన్ వోఎక్స్
సినిమా టిక్కెట్లు, ఆహార పదార్థాలపై 25 శాతం వరకూ తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకూ ఆ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి