Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. వేసవి దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో..

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సమ్మర్ క్రమంలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ మీదుగా ఈ రైళ్లు వెళ్లనున్నాయి. ఈ మేరకు ఎక్స్ అకౌంట్‌లో రైల్వేశాఖ రైళ్ల షెడ్యూల్స్‌ను విడుదల చేసింది. వాటి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.

Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. వేసవి దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో..
Indian Railways

Updated on: Apr 17, 2026 | 12:03 PM

సమ్మర్ సెలవులు కారణంగా రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే వేసవి ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. వేసవి సెలవుల కారణంగా చాలామంది టూర్లకు వెళుతున్నారు. దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనకు వెళ్తున్నారు. దీంతో రద్దీ పెరగడంతో ప్రత్యేక రైళ్లను తీసుకొస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. విజయవాడ మీదుగా ఈ స్పెషల్ రైళ్లు సర్వీసులు అందించనున్నాయి. ఈ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను తన ఎక్స్ అకౌంట్‌లో రైల్వేశాఖ పొందుపర్చింది. వాటి షెడ్యూల్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..

-బెంగళూరు-బాలూర్ఘాట్(06561) ప్రత్యేక రైలు ఈ నెల 19,26వ తేదీల్లో అందుబాటులో ఉంటుంది. బెంగళూరులో ఉదయం 8.50 గంటలకు ఈ రైలు బయల్దేరుతుంది. ఇక తర్వాతి రోజు ఉదయం 6 గంటలకు ఇది బలూర్ ర్ఘాట్‌కు చేరుకుంటుంది. ఇక ఇదే రైలు తిరుగు ప్రయాణంలో బాలూర్ఘాట్‌లో ఉదయం 5.15 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 3 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

-ఇక మైసూర్-న్యూజల్పాయ్ గురి(06251) ట్రైన్ 17,24వ తేదీల్లో తిరగనుంది. ఇది మైసూర్‌లో సాయంత్రం 4.40 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 5.30 గంటలకు గమ్యస్థానికి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఇది సాయంత్రం 4.45 గంటలకు న్యూజలపాయిగురిలో బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 5 గంటలకు మైసూర్‌కు చేరుకుంటుంది.

-ఇక యశ్వంత్ పూర్-న్యూజల్పాయ్ గురి(06567) ట్రైన్ ఈ నెల 17,24వ తేదీల్లో సర్వీసులు అందించనుంది. ఇది ఉదయం 7 గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయల్దేరి తర్వాతి రజు ఉదయం 7 గంటలకు న్యూజల్పాయ్ గురి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఉదయం 8.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 9.55 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుది.

-ఇక మైసూర్-దిబ్రుగర్(06253) రైలు 17,24వ తేదీల్లో ఉంటుంది. ఇది ఉదయం 8 గంటలకు మైసూర్ నుంచి బయల్దేరి తర్వాతి రోజు అర్ధరాత్రి 1.30 గంటలకు దిబ్రుగర్ చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో దిబ్రూగర్‌లో అర్ధరాత్రి 1.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 4.15 గంటలకు మైసూర్ చేరుకుంటుంది.

-బెంగళూరు-రుప్పా(06545) రైలు 22,29వ తేదీల్లో అందుబాటులో ఉండనుంది. ఇది సాయంత్రం 4.35 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరి తర్వాతి రోజు రాత్రి 8.30 గంటలకు రుప్పా చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో రాత్రి 8.30 గంటలకు రప్పా నుంచి బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

 

Follow Us