ATM: రోజురోజుకీ మోసాలు పెరిగిపోతున్నాయి. ఖాతాల్లో ఉన్న డబ్బును సైబర్ నేరగాళ్లు ఖాజేస్తుంటే ఏటీఎమ్‌లలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఏటీఎమ్ క్లోనింగ్ పేరుతో.. మన కార్డు వివరాలను సేకరించి డబ్బులు ఖాజేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ఏటీఎమ్ విత్‌డ్రాస్‌లో ఓటీపీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఎస్‌బీఐ అమలు చేస్తున్న ఈ విధానాన్ని త్వరలోనే అన్ని బ్యాంకులు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధానమే అమల్లోకి వస్తే ఏటీఎమ్‌ల నుంచి డబ్బులను తిసే విధానంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
అనధికారిక ట్రాన్సాక్షన్స్‌కు చెక్ పెట్టడానికి ఎస్‌బీఐ ఓటీపీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చంది. ఈ విధానాన్ని ఎస్‌బీఐ 2020 జనవరి 1వ తేదీ నంఉచి అమలు చేస్తోంది. దీని ద్వారా రూ. 10,000 అంతకంటే ఎక్కువగా డబ్బులను విత్‌డ్రా చేసుకుంటే ముందుగా రిజిస్టర్ మొబైల్ ఫోన్‌కు ఓ ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేస్తేనే డబ్బులు తీసుకునే వీలుంటుంది. ప్రస్తుతం కేవలం ఎస్‌బీఐకి మాత్రమే పరిమితమైన ఈ విధానాన్ని అన్ని బ్యాంకుల్లోనూ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
* ముందుగా ఏటీఎమ్ మిషిన్‌లో కార్డును ఇన్‌సెర్ట్ చేసి, పిన్ ఎంటర్ చేయాలి.
* అనంతరం విత్‌డ్రా అమౌంట్‌ను ఎంటర్ చేయగానే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వెళుతుంది.
* ఓటీపీని ఏటీఎమ్ స్క్రీన్‌పై ఎంటర్ చేస్తేనే అమౌంట్‌ను తీసుకోగలుగుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..