PPF Loan: పీఎఫ్‌ లోన్‌తో ఇన్ని ప్రయోజనాలా? వడ్డీ రేట్లతో పాటు నిబంధనలు తెలిస్తే షాక్‌..!

మీరు ఉద్యోగులైతే మీ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా పీఎఫ్‌ నుంచి కూడా లోన్‌ పొందే అవకాశం ఉంది. పీపీఎఫ్‌ లోన్ పర్సనల్ లోన్ కంటే చాలా తక్కువ ధరకే వస్తుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌)లో పెట్టుబడి పెడితే దానిపై వడ్డీని పొందడం కాకుండా మీరు అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

PPF Loan: పీఎఫ్‌ లోన్‌తో ఇన్ని ప్రయోజనాలా? వడ్డీ రేట్లతో పాటు నిబంధనలు తెలిస్తే షాక్‌..!
Personal Loan
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2023 | 10:00 PM

ధనం మూలం ఇదం జగత్‌ అంటే సమాజంలో ప్రతి పనికి డబ్బు అవసరం. అయితే ఆ అవసరం అనేది మనకు చెప్పి రాదు. అనుకోని అవసరాల్లో సొమ్ము కావాల్సినప్పుడు చాలా మంది వ్యక్తిగత లోన్‌ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే మీరు ఉద్యోగులైతే మీ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా పీఎఫ్‌ నుంచి కూడా లోన్‌ పొందే అవకాశం ఉంది. పీపీఎఫ్‌ లోన్ పర్సనల్ లోన్ కంటే చాలా తక్కువ ధరకే వస్తుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌)లో పెట్టుబడి పెడితే దానిపై వడ్డీని పొందడం కాకుండా మీరు అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే మీ లోన్ దరఖాస్తును పొందే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

వడ్డీ రేటు ఇలా

పీపీఎఫ్‌ లోన్ అనేది పీపీఎఫ్‌ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తం ఆధారంగా ఇస్తారు. కాబట్టి మనం ఏ వస్తువూ తనఖా పెట్టవలసిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం పీపీఎఫ్ ఖాతాపై వడ్డీ కంటే పీపీఎఫ్ రుణంపై వడ్డీ ఒక శాతం ఎక్కువ. అంటే మీరు మీ పీపీఎఫ్‌ ఖాతాపై 7.1 శాతం వడ్డీ రేటు వస్తుంది. అయితే మీరు మీ పీపీఎఫ్‌ లోన్‌పై 8.1 శాతం వడ్డీ రేటును చెల్లించాలి. పీపీఎఫ్‌ లోన్‌తో పోలిస్తే పర్సనల్ లోన్ వడ్డీ రేటు 10.50 శాతం నుంచి 17 లేదా 18 శాతం వరకు ఉంటుంది.

రుణ వ్యవధి

రుణం తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి చెల్లించడానికి మీకు మూడేళ్లు వ్యవధి ఉంటుంది. అంటే 36 వాయిదాల్లో తిరిగి చెల్లించారు. అంటే మీరు నెలనెలా వాయిదాల రూపంలో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. అయితే చెల్లింపు వ్యవధి ప్రకారం వడ్డీ లెక్కిస్తారు. అయితే రుణం చెల్లింపు వ్యవధి మధ్యలో ఒకేసారి మొత్తం సొమ్ము తిరిగి చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు 36 నెలల్లోపు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే,  పెనాల్టీగా మీరు మీ పీపీఎఫ్‌ మొత్తంపై వడ్డీ కంటే 6 శాతం అధికంగా రుణాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రుణ నిబంధనలు

మీ పీపీఎఫ్‌ ఖాతా ఒక ఆర్థిక సంవత్సరం పాతది అయితే మాత్రమే మీరు పీపీఎఫ్‌ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పీపీఎప్‌ ఖాతా యొక్క ఐదు సంవత్సరాలు పూర్తయితే దానిపై రుణ సదుపాయం అందుబాటులో ఉండదు ఎందుకంటే దీని తర్వాత మీరు పీపీఎఫ్‌ మొత్తాన్ని పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 25 శాతం మాత్రమే రుణంగా తీసుకోవచ్చు. మీరు మీ పీపీఎఫ్‌ ఖాతాపై ఒక్కసారి మాత్రమే లోన్ తీసుకోవచ్చు. మీరు ఇంతకు ముందు రుణాన్ని తిరిగి చెల్లించినప్పటికీ, ఈ ఖాతాపై మీకు తిరిగి రుణం పొందే సౌకర్యం లేదు.

రుణంపై దరఖాస్తు ఇలా

మీరు మీ పీపీఎఫ్‌ ఖాతాకు సంబంధించిన బ్యాంకులో బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పీపీఎఫ్‌ ఖాతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటే మీరు దాని కోసం ఫారమ్- డీ నింపవచ్చు. ఈ ఫారమ్‌లో మీరు రుణ మొత్తాన్ని, తిరిగి చెల్లించే వ్యవధిని పేర్కొనాలి. మీరు ఇంతకు ముందు ఏదైనా రుణం తీసుకుంటే మీరు దానిని ఫారమ్‌లో పేర్కొనాలి. దీని తర్వాత పీపీఎఫ్‌ పాస్‌బుక్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అన్ని ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత,  బ్యాంకు రుణం పంపిణీ చేయడానికి దాదాపు ఒక వారం పడుతుంది.

రిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి