Skoda Slavia: సరికొత్త ప్రీమియం మిడ్ సైజ్ సెడాన్ స్లావియా భారత్‌లో విడుదలైంది. ఈ కారును స్కోడా ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్, స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఎండీ గురుప్రతాప్ బొపారాల్ విడుదల చేశారు. స్ట్రాటజీ 2030లో భాగం గా ఈ కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ కారు డెలివరీలను ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనిని కొనుగోలు చేయాలంటే ముందుగా రూ.11,000 డౌన్ పేమెంట్‌ను చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చని తెలిపింది. హోండా సిటీ, హ్యుండయ్ వెర్నా, మారుతి సుజుకీ సియాజ్‌లకు స్లావియా గట్టి పోటీనిస్తుందని అంచనా.
అయితే స్లావియా తయారీ ప్రక్రియ 95 శాతం వరకు భారత్ లోనే జరిగిందని, ఆధునిక భారత ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఒరిజినల్ సెడాన్ ను తీసుకొచ్చామని గురుప్రతాప్ బొపారాల్ అన్నారు. ఇండియా 2.0 ప్రాజెక్టులో భాగంగా వందకు పైగా నగరాలకు తమ నెట్వర్క్ ను విస్తరించామని అన్నారు. అయితే ఈ కొత్త స్లావియా ఆకర్షణీయమైన ఐదు కలర్ వేరియెంట్లలో అందుబాటులో ఉంటుందని, 1752 మి.మీ. వెడల్పు, 521 లీటర్ల భారీ బూట్ సామర్థ్యంతో ఈ సెగ్మెంట్లో అత్యంత విశాలమైనది స్లావియా నిలుస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఈ కారు అత్యద్భుతమైన డిజైన్‌తో పాటు, అత్యంత సౌకర్యవంతమైన ఇంటీరియర్ తో స్కోడా స్లావియా వినియోగదారులను తప్పక ఆకట్టుకుం టుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: