Skoda Epiq EV: సూపర్ స్మార్ట్ ఈవీ కారును ప్రకటించిన స్కోడా.. రిలీజ్ ఎప్పుడంటే..?

ఇటీవల కాలంలో ఈవీ వాహన రంగంలో ఈవీ కార్లు కూడా అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. దీంతో అన్ని కార్ల కంపెనీలు కూడా ఈవీ వెర్షన్‌లు లాంచ్ చేయడంపై దృష్టి పెట్టాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన స్కోడా ఎపిక్ పేరుతో కొత్త ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీను ఆవిష్కరించింది. 2025లో విడుదల కానున్న ఎపిక్ పరిచయంతో ఎంట్రీ లెవల్ ఈవీ మార్కెట్లో తన వాటాను పెంచుకోవడంపై దృష్టి పెట్టి రిలీజ్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Skoda Epiq EV: సూపర్ స్మార్ట్ ఈవీ కారును ప్రకటించిన స్కోడా.. రిలీజ్ ఎప్పుడంటే..?
Skoda Epiq

Updated on: Mar 17, 2024 | 5:30 PM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటో మొబైల్ మార్కెట్ ప్రస్తుతం ఈవీ వాహనాల భూమ్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈవీ వాహన రంగంలో ఈవీ కార్లు కూడా అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. దీంతో అన్ని కార్ల కంపెనీలు కూడా ఈవీ వెర్షన్‌లు లాంచ్ చేయడంపై దృష్టి పెట్టాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన స్కోడా ఎపిక్ పేరుతో కొత్త ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీను ఆవిష్కరించింది. 2025లో విడుదల కానున్న ఎపిక్ పరిచయంతో ఎంట్రీ లెవల్ ఈవీ మార్కెట్లో తన వాటాను పెంచుకోవడంపై దృష్టి పెట్టి రిలీజ్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాబట్టి స్కోడా రిలీజ్ చేయనున్న ఎపిక్ ఈవీ కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

స్కోడా ఈవీ అడాప్షన్ ను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుందని నిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా ఈ కంపెనీ ఈ సంవత్సరం చివర్లో దాని మొదటి కొత్త యుగం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎల్రోక్‌ను పరిచయం చేయనుందని సమాచారం. వీడబ్ల్యూ గ్రూప్ యాజమాన్యంలోని చెక్ కార్మెకర్ స్కోడా ఆటో ఎపిక్ పేరుతో రిలీజ్ చేయనున్న ఈవీ ఎస్‌యూవీను 2025లో విడుదల చేసే అవకాశం ఉంది. స్కోడా ఎపిక్ 4.1 మీటర్ల పొడవుతో ఫైవ్ సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. అలాగే ఈ ఎస్‌యూవీలో 490 లీటర్ల వరకు లగేజీ సామర్థ్యాన్ని అందిస్తుంది. దాదాపు 25,000 యూరోల ధర ఉండవచ్చని అంచనా. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 22,57,693కే అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి కొత్త కష్టమర్లను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎపిక్ ఈవీ అధునాతన డిజైన్‌తో వస్తుంది. టెక్-డెక్ ఫేస్, హెడ్ ల్యాంప్స్‌లో మ్యాట్రిక్స్ ఎల్ఈడీ సాంకేతికత, టీ- ఆకారపు ఎల్ఈడీ-డీఆర్ఎల్‌లతో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా క్యాబిన్ మినిమలిస్ట్, ప్రాక్టికల్‌గా ఉంటుంది. వైర్లెస్ మొబైల్ ఫోన్ ఛార్జర్, 490 లీటర్ల బూట్ స్పేస్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటుంది. అలాగే  డిజిటల్ కీ సాంకేతికతతో పాటు సూపర్ స్పీడ్ ఛార్జింగ్ సామర్థ్యాలు, రాడార్లు వంటి ఫీచర్లు ఉంటాయని నిపుణుల అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ కారు 400 కిమీల మైలేజ్ ఇస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే భారతీయ మార్కెట్లోకి ఈ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రవేశానికి సంబంధించి కంపెనీ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే స్కోడా ఎపిక్ ఈవీ భారతదేశంలో రిలీజ్ చేస్తే మాత్రం హ్యుందాయ్ కోనాతో పాటు ఎంజీ జెడ్ఎస్ ఈవీ కార్లకు గట్టి పోటినిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి