AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: వెండి ధర మరింత తగ్గనుందా? సోలార్‌ కంపెనీల సంచలన నిర్ణయంతో ఏం జరగబోతుంది?

కొంతకాలంగా ఆకాశామే హద్దుగా పెరిగిన వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్ తగ్గడంతో కుప్పకూలాయి. సోలార్ కంపెనీలు తమ ప్యానెల్స్‌లో వెండి వాడకాన్ని తగ్గించుకోవడం లేదా పూర్తిగా నిలిపివేయడం దీనికి ప్రధాన కారణం. కొత్త సాంకేతికతలతో వెండి వాడకాన్ని గణనీయంగా తగ్గించడంతో, పారిశ్రామిక డిమాండ్ మరింత క్షీణించి భవిష్యత్తులో వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

Silver: వెండి ధర మరింత తగ్గనుందా? సోలార్‌ కంపెనీల సంచలన నిర్ణయంతో ఏం జరగబోతుంది?
Silver
SN Pasha
|

Updated on: Feb 02, 2026 | 4:04 AM

Share

కొంతకాలం నుంచి ఆకాశామే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలు.. ఒక్కసారిగా కుప్పకూలాయి. వెండి కొనాలనుకునే వారికి ఈ తగ్గుదల సంతోషాన్ని ఇచ్చినా.. పెట్టుబడిదారులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వెండి విషయంలో అనుకున్నదే జరుగుతోందా అనిపిస్తోంది. గతంలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇండస్ట్రియల్ వెండి వాడకం తగ్గింది. అయితే రిటైలర్లు ఎగబడటంతో వచ్చిన ర్యాలీ హైప్ అమెరికా ట్రంప్ నిర్ణయం దెబ్బకు కుప్పకూలింది. మార్కెట్లో అది ఎప్పటికీ కొనసాగదని.. ఇండస్ట్రీ డిమాండ్ లేకుండా వచ్చే డిమాండ్ ఎక్కువ రోజులు నిలవులేదని వెండి పతనం నుంచి అర్థం చేసుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా అంటే..? అవును అనే సమాధానామే వినిపిస్తోంది. కాగా ఈ తగ్గుదల వెనుక సోలార్‌ కంపెనీల నిర్ణయం కూడా కీలకంగా మారింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

సౌర విద్యుత్ రంగంలో అగ్రగామి కంపెనీలు ఒక కొత్త మార్పుకు సిద్ధమవుతున్నాయి. సోలార్ ప్యానెల్స్ తయారీలో కీలకమైన వెండి వాడకాన్ని భారీగా తగ్గించాలని లేదా పూర్తిగా ఆపేయాలని వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్, ఎమ్వీ వంటి సంస్థలు నిర్ణయించుకున్నాయి. వెండి ధరలు ఆకాశాన్ని తాకుతుండటమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. గడిచిన ఏడాది కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో వెండి రేట్లు విపరీతంగా పెరిగాయి. 2025లో రెట్టింపైన వెండి ధర, 2026 ప్రారంభం నాటికే మరో 40 శాతం మేర పెరిగింది. దీనివల్ల సోలార్ సెల్ తయారీ ఖర్చులు భారీగా పెరిగాయి.

గతంలో ఒక వాట్ తయారీకి ఒక సెంటుగా ఉన్న వెండి ఖర్చు, ఇప్పుడు 2.7 సెంట్లకు చేరింది. ఈ అదనపు భారం కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతోంది. సాధారణంగా ఒక 2 చదరపు మీటర్ల సోలార్ ప్యానెల్‌లో దాదాపు 20 గ్రాముల వెండిని ఉపయోగిస్తారు. విద్యుత్తును సమర్థవంతంగా ప్రవహింపజేయడానికి ఇది అవసరం. కానీ ప్రస్తుతం రేట్లు పెరుగుతున్న తరుణంలో వెండి వాడకాన్ని ఆపేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. అదే జరిగితే వెండి ధరకి ఇండస్ట్రీయల్‌ డిమాండ్‌ బాగా తగ్గిపోతుంది. అప్పుడు ధరలు మరింత తగ్గుతాయి. మరి వెండి వాడకుండా సోలార్‌ కంపెనీలు ఎలా తమ మనుగడను సాగిస్తాయంటే.. కంపెనీలు అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. పాత ‘మల్టీక్రిస్టలైన్’ సాంకేతికత నుంచి TOPConకు మారడం వల్ల ఇప్పటికే వెండి వినియోగం 68 శాతం తగ్గించుకున్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరో 30 శాతం తగ్గించాలని టార్గెట్ కంపెనీలు పెట్టుకున్నాయి. చైనా ఇప్పటికే ‘సిల్వర్ కోటెడ్ కాపర్ పేస్ట్’ అనే కొత్త విధానాన్ని వాడుతోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి