Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Oct 07, 2021 | 6:08 AM

Silver Price Today: పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. దీంతో పాటు వెండి కొనుగోళ్లు బాగానే

Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price
Follow us on

Silver Price Today: పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. దీంతో పాటు వెండి కొనుగోళ్లు బాగానే జరుగుతుంటాయి. భారతీయులు వెండి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే వెండితే తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది.
తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో రూ.100 దాకా పెరిగాయి. గురువారం (అక్టోబర్‌ 7) దేశీయంగా ప్రధాన ప్రాంతాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.60,700 ఉండగా, చెన్నైలో రూ.64,900 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.60,700 ఉండగా, కోల్‌కతాలో రూ.60,700 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,700 ఉండగా, కేరళలో రూ.60,700 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,900 ఉండగా, విజయవాడలో రూ. 64,900 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిది.

IPL 2021 RCB vs SRH: ఆర్సీబీపై ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్‌.. ఉమ్మడిగా రాణించిన బౌలర్లు..