Silver Rate Today: దేశంలో బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. తాజాగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే ఒక ప్రాంతంలో పెరుగుతుంటే. మరో ప్రాంతంలో తగ్గుతుంది వెండి ధర. ఇక దేశీయంగా కిలో వెండి ధరపై రూ.100 పెరిగితే.. అదే హైదరాబాద్‌లో మాత్రం రూ.500 మేర తగ్గుముఖం పట్టింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలను పరిశీలిస్తే..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలోరూ.71,600 వద్ద ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, కోల్‌కతాలో రూ.71,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, కేరళలో రూ.71,600 ఉంది.
అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 76,000 ఉండగా, విజయవాడలో రూ.76,000 వద్ద కొనసాగుతోంది. అయితే దేశీయంగా బంగారం ధరల్లో ఇలాగానే వెండి ధరల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారతీయులు బంగారం, వెండికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. రోజువారీగా వెండి కొనుగోళ్లు పెద్దగా జరగకపోయినా.. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు సిల్వర్ కొనుగోలు భారీగా జరుగుతుంటాయి. అయితే దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కస్టమర్లు కొనుగోలు చేసే ముందు ధరలను చూసుకొని వెళ్లడం మంచిది.
Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజు 300 చొప్పున ఆదా చేస్తే కోటి రూపాయలు పొందవచ్చు..!