Silver Price Today: ఒక వైపు బంగారం ధరలు పరుగులు పెడుతుంటే వెండి మాత్రం దిగి వచ్చింది. తాజాగా గురువారం దేశీయంగా వెండి ధరలను పరిశీలిస్తే భారీగానే తగ్గిందని చెప్పాలి. కిలో బంగారంపై రూ.700 మేర తగ్గుదల నమోదైంది. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన వెండి ధర.. మే నెల నుంచి క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ నెల నుంచి కూడా పెరుగుతూ వచ్చిన వెండి ధర ఈ రోజు మాత్రం తగ్గింది. మంగళవారం కిలో వెండి ధరపై రూ.400 పెరుగగా, బుధవారం రూ.600 పెరిగింది. ఇక గురువారం మాత్రం రూ.700 వరకు తగ్గుముఖం పట్టింది. తాజాగా ఢిల్లీలో కిలో వెండిపై రూ.900 వరకు తగ్గగా, చెన్నైలో ఏకంగా రూ.1300 వరకు తగ్గుముఖం పట్టింది. ముంబైలో కూడా కిలో వెండిపై రూ.800 వరకు తగ్గింది. అలాగే బెంగళూరు, కోల్‌కతాలలో రూ.700 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 71,900 ఉండగా, చెన్నైలో రూ.76,600 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కోల్‌కతాలో రూ.71,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కేరళలో రూ.71,900 ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,600 ఉండగా, విజయవాడలో రూ.76,600 ఉంది.