Silver Price Today: బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ధరలు లాగే ఒక రోజు తగ్గుతుంటే మరో రోజు పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశీయంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ.1000 వరకు తగ్గుముఖం పట్టగా, హైదరాబాద్‌లో రూ.1100 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక శుక్రవారం దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,300 ఉండగా, చెన్నైలో రూ.75,100 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.70,300 ఉండగా, కోల్‌కతాలో రూ.70,300 ఉంది, అలాగే బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,300 ఉండగా, కేరళలో రూ.70,300 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,100 ఉండగా, విజయవాడలో రూ.75,100 వద్ద కొనసాగుతోంది.
అయితే శుక్రవారం ఉదయం ఉన్న ధరలు ఇవి. ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. వెండి కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిదంటున్నారు నిపుణులు.