Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి అత్యంత ప్రముఖ్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. తాజాగా బంగారం బాటలోనే వెండి వెళ్తోంది. ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లే వెండి ధర కూడా తగ్గింది. తాజాగా శనివారం ఉదయం నాటికి కిలో వెండి పై రూ.1000 వరకు తగ్గుముఖం పట్టింది. అయితే హైదరాబాద్‌లో మాత్రం రూ.600 మాత్రమే తగ్గింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. వెండినే కొనుగోలు చేసేవారు ఆ సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది. ఇక దేశంలోని ప్రధాన నరగాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా, చెన్నైలో రూ.71,700 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా, కోల్‌కతాలో రూ.66,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా, కేరళలో రూ.71,700 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,700 ఉండగా, విజయవాడలో రూ.71,700 వద్ద కొనసాగుతోంది. ఇక పుణేలో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా, అహ్మదాబాద్‌లో రూ.66,600 ఉంది.