Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..

|

Apr 30, 2021 | 6:46 AM

Today Silver Price: దేశంలో బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతూ వస్తుంటాయి. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో

Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..
Silver Price Today
Follow us on

Today Silver Price: దేశంలో బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతూ వస్తుంటాయి. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో నిత్యం వ్యత్యాసం ఏర్పడుతుంటుంది. దేశంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. కాగా శుక్రవారం వెండి ధరలు భారీగానే పెరిగాయి. కిలో వెండి ధర గురువారం 67,800 ఉండగా.. శుక్రవారం 68,600లు ఉంది. అంటే 800 రూపాయలు పెరిగింది. అయితే దేశంలోని ప్రధాన నగరాలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,600 లుగా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.68,600 ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.73,300 ఉంది. కాగా ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది.
బెంగళూరులో రూ.73,300 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.68,600 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో వెండి కిలో రూ.73,300 లు ఉంది.
విజయవాడలో వెండి రూ.73,300 వద్ద కొనసాగుతోంది.

బంగారం..
ఇదిలాఉంటే.. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
తెలంగాణలోని హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,300 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,330 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,330 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,330 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Marriage: ‘మా నాన్నకు పెళ్లి’ చేశాను..అందరూ ఆశీర్వదించండి..తండ్రి పెళ్లి ఫోటో పోస్ట్ చేసిన కూతురు!

Exit Polls 2021: తమిళనాట డీఎంకే.. బెంగాల్ దీదీకే..కేరళలో మళ్ళీ విజయన్ సర్కారే అంటున్న ఎగ్జిట్ పోల్స్..ఆ లెక్కలు ఇలా..