Silver Price Today: నేల చూపులు చూస్తోన్న వెండి.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన సిల్వర్‌ రేట్‌.. కిలో వెండి ఎంతుందంటే.

|

Jul 29, 2021 | 6:47 AM

Silver Price Today: ఓవైపు బంగారం ధరలు పెరిగితే మరోవైపు వెండి ధరలు మాత్రం నేల చూపులు చూశాయి. గురువారం దేశంలోని పలు నగరాల్లో సిల్వర్‌ రేట్‌ భారీగా తగ్గింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎన్నడూ లేని విధంగా...

Silver Price Today: నేల చూపులు చూస్తోన్న వెండి.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన సిల్వర్‌ రేట్‌.. కిలో వెండి ఎంతుందంటే.
Silver Price
Follow us on

Silver Price Today: ఓవైపు బంగారం ధరలు పెరిగితే మరోవైపు వెండి ధరలు మాత్రం నేల చూపులు చూశాయి. గురువారం దేశంలోని పలు నగరాల్లో సిల్వర్‌ రేట్‌ భారీగా తగ్గింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే కిలో వెండిపై ఏకంగా రూ. 5000 తగ్గడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఇతర నగరాల్లోనూ వెండి ధర నేల చూపులు చూసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో గురువారం కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ. 66,400గా ఉంది. ఇక్కడ బుధవారంతో పోలిస్తే మార్పు రాలేదు.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా వెండి ధరలో మార్పు లేదు. ఇక్కడ కిలో వెండి ధర రూ. 66,400 ఉంది.
* చెన్నైలో గురువారం రూ. 200 తగ్గిన కిలో వెండి ధర రూ. 71,200గా ఉంది.
* బెంగళూరులో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ కిలో వెండి ధర రూ. 66,400గా ఉంది.
* కోల్‌కతాలో కూడా వెండి ధరలో మార్పు కనిపించలేదు. ఇక్కడ గురువారం కిలో వెండి రూ. 66,400 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గాయి..

* హైదరాబాద్‌లో వెండి ధరలో భారీ తగ్గుదల కనిపించింది. ఇక్కడ కిలో వెండిపై ఏకంగా రూ. 5000 తగ్గి ప్రస్తుతం రూ. 66,400 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో కిలో వెండిపై రూ. 200 తగ్గి రూ. 71,200గా ఉంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండిపై రూ. 200 తగ్గింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 71,200 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఇంట్లో కూర్చుని రూ.15 లక్షలు గెలుచుకోండి.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏం చేయాలో తెలుసా?

Global Tiger Day: రాత్రుల్లో మనుషుల కంటే పులులు ఆరు రెట్లు బాగా చూడగలవు.. టైగర్స్‌ గురించి ఆసక్తికర విషయాలు..!

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా గురువారం తులం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే..